ఠాణాలో డ్యాన్స్ ఎఫెక్ట్… షోకాజ్ నోటీస్ జారీ…

దిశ దశ, భూపాలపల్లి: 

పోలీస్ స్టేషన్ కార్యాలయంలో డ్యాన్స్ చేసిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా నే తీసుకున్నట్టుగా ఉంది. జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన ఈ అంశం గురించి భూపాలపల్లి  జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే పరిగణించింది. స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బందిపై జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సద్దు మణిగిపోయిందని భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే పరిగణించినట్టుగా స్పష్టం అవుతోంది.  జిల్లాలోని మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో స్థానిక జడ్పీటీసీ గుడాల అరుణ భర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుడాల శ్రీనివాస్ డ్యాన్స చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కూడా తాను డ్యాన్స్ చేయడం వల్ల కూడా యోగా లాంటిదేనని దీనివల్ల ఆరోగ్యంగ ఉండవచ్చన్న తలంపుతోనే తాను డ్యాన్స్ చేసి ప్రాక్టికల్ గా పోలీసులకు చూపించాను తప్ప… అధికార పార్టీ నాయకుడిని దుర్వినియోగానికి పాల్పడలేదని ప్రకటించారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్సీ ఇద్దరిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్న గంటల వ్యవధిలోనే అదే రోజును గుడాల శ్రీనివాస్ నోటీసులు జారీ అయినట్టు సమాచారం. భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి ఈ మేరకు ఈ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందని… ఏడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన షోకాజ్ నోటీస్ గురించి చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page