డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ మృతి…
దిశ దశ, దండకారణ్యం:
అభూజామఢ్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎదురు కాల్పుల్లోడిస్ట్రిక్ట్ రిజర్వూ బలగాలకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మరణించాడు. బుధవారం మద్యాహ్నం నుండి నారాయణపూర్ జిల్లాలోని అభూజామఢ్ అడవుల్లోని కోహ్కమెట్టా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పలుమార్లు నక్సల్స్ కు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా బస్తర్ రేంజ్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ బీరేంద్ర కుమార్ నక్సల్స్ కాల్పుల్లో మరణించినట్టుగా పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే బలగాలు మాత్రం కూంబింగ్ ఆఫరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి.