డేటా చోరీ గ్యాంగ్స్… ట్రేస్ చేసిన పోలీసులు

చోరీకి కాదేది అనర్హం అన్నట్టుగా తయారైంది నేడు. తాజాగా సైబరాబాద్ పోలీసులు గుట్టు రట్టు చేసిన గ్యాంగ్ గురించి తెలిస్తే షాక్ కు గురి కావల్సిందే. చివరకు పర్సనల్ డేటాను కూడా తస్కరించే ముఠాలు తయారయ్యాయి. వ్యక్తిగత వివరాలన్నింటిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తూ పబ్బం గడుపుకుంటున్న ఈ గ్యాంగును పట్టుకోవడంతో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు గురువారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా డేటా చోరీకి పాల్పడుతున్న ఈ ముఠాలను పట్టుకోవడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16.8 కోట్ల మంది డాటా భద్రంగా ఉండిపోయింది. ఆరుగురు సభ్యులు ఉన్న ముఠా ఇప్పటికే 2.55 లక్షల మంది డేటాను విక్రయించుకుందని కూడా విచారణలో తేలినట్టు సీపీ స్టీఫెన్ రవింద్ర తెలిపారు. ఆధార్, పాన్ కార్డులతో పాటు బ్యాంకు అకౌంట్ల పూర్తి వివరాలను దేశ వ్యాప్తంగా సేకరించే పనిలో ఈ గ్యాంగ్ నిమగ్నమైనట్టు వివరించారు. ఈ ముఠాలో ఉత్తరప్రదేశ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుమార్ నితీష్ భూషన్ ఇన్ఫోటెక్, డాటా మార్ట్, గ్లోబల్ డాటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో వంటి కంపెనీలను ఏర్పాటు చేసి కుమార్ పూజా పాల్, అతుల్ ప్రతాప్ సింగ్, సుశీల్ తోమర్, ముస్కాన్ హసన్, సందీప్ పాల్ మరో ముగ్గురు కలిసి డాటా చౌర్యానికి పాల్పడుతున్నారన్నారు. పాన్ ఇండియా గవర్నమెంట్ ఉద్యోగుల డేటా తో పాటు పలు బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్ ల డేటా, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థలతో పాటు జస్ట్ డయల్ వంటి వాటి నుండి కూడా డేటా తస్కరించి వేరే వారికి విక్రయిస్తున్నారని, ఇందులో ఎక్కువగా ఢిల్లీ, ముంబాయి, నాగపూర్ ప్రాంతాలకు చెందిన వారే క్రియాశీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులు నిర్దారించారు.

సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సిస్టమ్స్ తదితరాలు

You cannot copy content of this page