తల్లిని అభినందించిన తనయ…

యోగాలో అద్భుత ప్రతిభ కనబర్చిన కలెక్టర్ తల్లి…

దిశ దశ, కరీంనగర్:

ఎదిగిన బిడ్డలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతుండడం కామన్… తమ బిడ్డలు ఉన్నత శిఖరాలకు చేరినప్పడు ఆనందంలో తేలియాడడమూ సాధారణమే. వారిని అక్కున చేర్చుకుని ఆ పేరెంట్స్ తమలోని ప్రేమను ప్రదర్శిస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది… అయితే ఆ తల్లి ఉద్యోగం అందుకునో… లేక ఉన్నత చదువులు చదివో మాత్రం కాదు… మనవళ్లను ఎత్తుకుంటూ సంతోషంతో కాలం వెల్లదీయాల్సిన ఆమె యోగాలో అద్భుత ప్రతిభను కనబర్చడమే ఇందుకు కారణం. అరుదైన మధురానుభూతిని అందుకున్నారు కరీంనగర్ కలెక్టర్ తల్లి కూతుళ్లు.

యోగాలో…

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తల్లి ప్రవమయిల మధ్య జరిగిన ఈ అద్భుత సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అభినందించారు. శనివారం కరీంనగర్ జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయితే ఆమె చేతుల మీదుగా తల్లి ప్రవమయి ప్రశంసా పత్రం అందుకున్నారు. జిల్లా స్థాయిలో జరగిన ఈ యెగా పోటీలలో పాల్గొన్న ప్రవమయి రజత పతకం అందుకున్నారు. నిత్యం యోగ చేసే కలెక్టర్ తల్లి ప్రవమయి కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపి అద్భుత ప్రతిభను కనబర్చారు. అయితే పోటీలో పాల్గొని యోగా ప్రదర్శించిన వారితో పోటీ పడిన ప్రవమయికి ఆమె తనయ, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రశంసా పత్రాన్ని అందించారు. సాధారణంగా పేరెంట్స్ అభినందనలు అందుకునే సాంప్రాదాయం ఉంటుంది కానీ కరీంనగర్ యోగా పోటీల్లో మాత్రం తల్లిని తనయ అభినందిచిన సందర్భం స్థానికులను అబ్బురపరిచింది. అయితే బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి, ఆమె తల్లి ప్రవమయిలు మాట్లాడుతూ… తమ జీవితంలో ఇది మరిచిపోలిన ఘటన అంటూ వ్యాఖ్యానించారు. తల్లి నుండి షెబాష్ బిడ్డా అని కితాబు అందుకోవల్సిన తనయే తల్లిని అభినందించాల్సిన సందర్భం ఏర్పడడం నిజంగానే అరుదైన సందర్భమే కదా. ఈ కార్యక్రమంలో జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ రవీందర్ సింగ్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి సుధాకర్, క్రీడలు యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ కుమార్, నెహ్రు యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎన్ సిద్ధారెడ్డి, జూడో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి జనార్దన్ రెడ్డి, కోచులు వి కిష్టయ్య రామకృష్ణ, మల్లేశ్వరి, ఉప్పాల శ్రీనివాస్ ఆనంద్ కిషోర్, బి సుష్మ ప్రశాంత్, కోటేశ్వరరావు, ప్రవీణ, వ్యాయామ ఉపాధ్యాయులు సమ్మయ్య, శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page