దిశ దశ, నిర్మల్:
కానరాని తీరానికి చేరుకున్న అమ్మకు అఖరి మజిలీ నిర్వహించేందుకు ఓ బిడ్డ తల్లడిల్లిపోతున్నది. తల్లికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బుల్లేక బిక్షాటన చేస్తోంది. పలువురిని కంటతడిపెట్టిస్తున్న ఈ ఘటన తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో జరిగింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తారోడాకు చెందిన గంగామణి (36) కొంతకాలంగా భర్తకు దూరంగా జీవనం సాగిస్తోంది. తనతో పాటు కూతురు దుర్గను తీసుకొచ్చుకున్న గంగామణి కూలీ నాలీ చేసుకుంటూ బ్రతుకు వెల్లదీస్తోంది. ఆర్థిక, కుటుంబంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేకపోయిన గంగామణి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బలవర్మణానికి పాల్పడిన తల్లికి అంతిమ సంస్కారం చేసేందుకు చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఆమె బిడ్డ బిక్షాటన చేస్తోంది. ఓ వైపున తల్లిని కోల్పోయి… మరో వైపున ఆమె అంత్యక్రియలు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆ చిన్ని మనసు తల్లడిల్లిపోతున్న తీరును చూసిన స్థానికులు తమవంతు సాయం అందిస్తున్నారు.