బర్త్ డే చేస్తే కిక్కేముందబ్బా… ?


ఏపీ మాజీ మంత్రి వెరైటీ ప్రోగ్రాం

కిక్కు కోసం అత్యంత విచిత్రమైన కార్యకలాపాలకు పాల్పడతాడు ఓ సినామాలో హీరో రవితేజ. కిక్కు కావాలని తాను చేసి పనిలో కిక్కుండాల్సిందేనని మరీ మరి చెప్తుంటాడు. అయితే ఆ మూవీలో రవితేజ కూడా చేసిన చర్యల్లో తెచ్చుకునే సొమ్మంతా కూడా అనాథ పిల్లలకు వెచ్చిస్తున్నాడని చివరి వరకు అర్థం కాకుండా సినిమా తీశారు. అంతే కాకుండా లాస్ట్ షాట్ లో నాయకుల సొత్తు అయితే కొట్టేస్తారో వారి ముందే పోలీసు అధికారిగా ప్రత్యక్షం అవుతాడు. వైవిద్యమైంగా తీసిన ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చినట్టుగానే ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీకి చెందిన ఓ నేత భారీ స్థాయిలో ట్విస్ట్ ఇచ్చాడు. అధికార పార్టీకో, ప్రతిపక్ష పార్టీకో ఆయన ఈ ట్విస్ట్ ఇవ్వలేదు. ఆ నేత వ్యవహరించిన తీరుతో జాతీయ స్థాయిలో సరికొత్త చర్చకు తెరలేపారు. ఇంతకీ ఎవరా నాయకుడు..? ఇంతకీ ఆయనేం చేశాడో తెలుసా..?

డెత్ డే…

జన్మదినోత్సవాలు చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అవలంబిస్తుంటారు. బర్త్ డే సందర్భంగా కేక్ లు కట్ చేయడం, గుడికో బడికో వెల్లి రావడం, సేవా కార్యక్రమాలు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ తమయోక్క స్పెషాలిటీని ప్రదర్శించడం సర్వ సాధారణం. కానీ ఏపీకి చెందిన ఈ నాయకుడు మాత్రం జనానికి కిక్కిచ్చే విధంగా వ్యవహరించాడనుకోండి. బర్త్ డే చేసుకోవడానికి విరుద్దంగా ఆయన డెత్ డే నిర్వహించుకున్నారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు వైవిధ్యమైన నిర్ణయం తీసుకుని శనివారం పట్టణంలోని ఐఎంఏ హాల్ లో కేక్ కట్ చేసి మరీ మరణ దిన వేడుకలు నిర్వహించారు. తన సన్నిహితులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి గ్రాండ్ గా డెత్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

కొలమానం ఇదేనంట…

తాను 75 ఏళ్ల పాటు జీవించాలని లక్ష్యంగా పెట్టుకున్న రామారావు ఇప్పటికి 63 ఏళ్లు గడిచిపోయిందని, దీంతో మరో 12 ఏళ్లు మాత్రమే బ్రతుకుతానని అంచనా వేసుకున్నానని ఇందు కోసం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలో వివరించారు. 1959లో పుట్టిన తాను 2034లో మరణిస్తానని కూడా అందులో పేర్కొనడం విచిత్రం. పుట్టిన తేది లాగానే మరణానికి కూడా ఓ తేది ఉండాలని భావించే తానీ నిర్ణయం తీసుకున్నానని అంటున్నారు. జీవి దశ నుండి మనిషి దశలోకి మారే ప్రయత్నం చేసే సిద్దాంతాన్ని అమలు చేసేందుకు తొలి ప్రయత్నంగా ఈ గణాంకాలతో మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నానని ఆ కార్డులో స్ఫష్టంగా వివరించారు. పాలేటి రామారావు తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మాజీ మంత్రికి ఇదో రకం కిక్కులా ఉందే అనుకుంటున్నారు ఏపీ ప్రజలు.

You cannot copy content of this page