తమ్ముడి కోసం వెల్లను… రాజకీయాలకు అతీతంగా ఉన్నాను: చిరంజీవి

దిశ దశ, జాతీయం: 

రాజకీయాలకు అతీతంగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కు వెన్నంటి ఉంటానని, ఆయన గెలవాలని కోరుకుంటున్నానని చెప్పిన చిరంజీవి పీఠాపురం వెల్లి ప్రచారం మాత్రం చేయనని తేల్చేశారు. చిరంజీవి చేసిన ఈ ప్రకటన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు షాకిచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి ఇంకా తమ పార్టీలోనే కొనసాగుతున్నారని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడేనని ఇటీవలే ఏపీ ముఖ్య నాయకులు ప్రకటించారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారని అనుకోవచ్చని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన సమాధానంతో ఆయన కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసినట్టయింది. తానిప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటున్నానని వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ కు కూడా దూరమేనని తేల్చి చెప్పినట్టయింది. చిరంజీవి మా నాయకుడే అని ఘంటాపథంగా చెప్పిన ఏపీ కాంగ్రెస్ నాయకులు చిరంజీవి తాజాగా చేసిన ఈ ప్రకటనతో సైలెంట్ కాక తప్పదు. అంతే కాకుండా తన తమ్ముడి విషయంలో మాత్రం సానుకూలంగా మాట్లాడిన చిరంజీవి ఆయనకు అండగా నిలుస్తాను కానీ పిఠాపురం వెల్లి ప్రచారం మాత్రం చేయనన్నారు. దీంతో చిరంజీవి ఇటీవల విడుదల చేసిన వీడియోతోనే పవన్ కళ్యాణ్ అభిమానులు సరిపెట్టుకోవల్సి ఉంది. 

You cannot copy content of this page