మంచుతో సహజీవనం చేసినంతగా ఉండే దేశ రాజధాని చలిలోనే కాదు… ఎండలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. 14 ఏళ్ల తరువాత ఢిల్లీలో అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. 14 ఏళ్ల క్రితం నవంబర్ నెలలో అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఇఫ్పుడు ఆ రికార్డు రిపిట్ అయిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సోమవారం 33 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలు ఢిల్లీలో నమోదు అయిందని, గరిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయిందని, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ సీజన్ సగటు కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు అయినట్టు వాతావరణ శాఖ పేర్కొంది.