చెట్లు నరికివేతపై ఆందోళన

దిశ దశ, మానకొండూరు:

తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీ కాలనీలో చెట్ల నరికివేతను నిరసిస్తూ బీజేపీ, బీఎస్పీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం ఎల్ఎండీ కాలనీలోని మహాత్మానగర్ లో చెట్లు నరికివేస్తున్న ప్రాంతానికి బీజేపీ నాయకులు జగదీశ్వరాచారీ, బీఎస్సీ రాష్ట్ర నాయకుడు నిషాని రామంచంద్రంలు ఆందోళన నిర్వహించారు. చెట్ల నరికివేతకు పూనుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా చెట్లు నరుకుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ముందు ముందు భూమిని ఆక్రమించుకునే అవకాశం కూడా లేకపోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చెట్ల నరకివేతకు ఉపయోగించిన మిషనరీ, తరలించిన ట్రాక్టర్లను సీజ్ చేయాలని బీఎస్పీ నాయకుడు రామచంద్రం డిమాండ్ చేశారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇరిగేషన్ అధికారులు గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికివేశారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

You cannot copy content of this page