స్మారక స్థూపం కూల్చివేత…
దిశ దశ, దండకారణ్యం:
అమర వీరుల వారోత్సవాలు ప్రారంభం అయిన నేపథ్యంలో చత్తీస్ గడ్ లోని దండకారణ్యంలో బలగాలు ఎదురు దాడులకు శ్రీకారం చుట్టాయి. సంస్మరణ సభలు నిర్వహించేందుకు మావోయిస్టులు సమాయత్తం అయిన నేపథ్యంలో కీకారణ్యంలో ఓ వైపున ఏరివేత కోసం ఆపరేషన్లు నిర్వహిస్తూనే మరో వైపున నక్సల్స్ స్మారక స్థూపాల కూల్చివేత మొదలు పెట్టాయి బలగాలు. దంతెవాడ జిల్లా కొసల్నార్ సమీపంలో మావోయిస్టులు నిర్మించిన స్థారక స్థూపాన్ని బలగాలు ధ్వంసం చేశాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన కంపెనీ కమాండర్ సతీష్ స్మారకార్థం కొసల్నార్ సమీపంలో ఇటీవల మావోయిస్టులు స్మారక స్థూపాన్ని నిర్మించారు. గ్రామంలో అమ రవీరుల వారోత్సవాలు నిర్వహించారన్న సమాచారం అందుకున్న బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ బలగాలు గ్రామానికి చేరుకుని ఆరా తీశాయి. ఈ నేపథ్యంలోనే సతీష్ జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపాన్ని ధ్వంసం చేశారు.