లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆపీసర్…

దిశ దశ, హైదరాబాద్:

హోదాతో పని లేదు… వచ్చే జీతం సరిపోదు… సర్కారు ఆదాయానికి గండి కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటూ అవినీతికి తెరలేపుతున్న అధికారులపై తెలంగాణ ఏసీబీ కొరడా ఝులిపిస్తూనే ఉంది. తాజాగా డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని రెడ్ హైండెడ్ గా పట్టుకుంది. హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బి వసంత ఇందిర రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికట్ టెస్టులో ఆమె కుడిచేతి వేళ్లకు సంబంధించిన ఆధారాలు లభ్యం అయ్యాయి. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాంపల్లి ఎసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నారు. బాధితునికి సంబంధించిన అకౌంట్లలో అవకతవకలకు మినహాయింపు ఇచ్చేందుకు సమ్మతించారు. ఇందు కోసం రూ. 35 వేలు  లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం ఆమెను ట్రాప్ చేశారు ఏసీబీ అధికారులు.

You cannot copy content of this page