దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు శాఖలు కెటాయించారు. మొదట శాఖల కెటాయింపు జరిగినట్టుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కూడా శాఖల కెటాయింపు ప్రక్రియ జరగలేదని వెల్లడించారు. తాజాగా మంత్రులకు శాఖలు కెటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ తో పాటు మంత్రులకు కెటాయించని శాఖలను పర్యవేక్షిస్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక, ఎనర్జీ శాఖలు, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్, సివిల్ సప్లై, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఇనఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్. శాసనసభ వ్యవహారాలు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ, హౌజింగ్, పౌరసంబంధాల శాఖ, పొన్నం ప్రభాకర్ కు రవాణా, బీసీ సంక్షేమం, కొండ సురేఖకు అడవులు పర్యావారణ, దేవాదాయ, సీతక్కకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది (గ్రామీణ నీటి సరఫరతో సహ), స్త్రీ, శిశు సంక్షేమం, తుమ్మల నాగేశ్వర్ రవుకు వ్యవసాయం, మార్కెటింగ్, కో ఆపరేషన్, హైండ్ లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్, జూపల్లి కృష్ణారావుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం కల్చర్, పురావస్తు శాఖలను కెటాయించారు.