తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వ్యక్తి దేవీ శ్రీ ప్రసాద్. ఇక మ్యూజిక్‌కి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతీ ఒక్కరు చిందు వేయకుండా ఉండలేరు. అంతే కాకుండా ఈయన ఎన్నో సినిమాలకు సంగీతం అందించి, మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ క్రేజ్ తగ్గిపోయిందనే చెప్పాలి. సంగీతంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుం చాలా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. వేరే సినిమాలో ఉపయోగించే సంగితాన్ని తన సినిమాకి వాడి కాపీ కొడుతున్నాడంటూ చాలా వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే దేవీ శ్రీ ప్రసాద్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏదో కాదండి, ఆయన పెళ్లి కి సంబంధించిన ఇష్యూ. ఆ మధ్య కాలంలో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే, అంతే కాకుండా నటి చార్మీతో ప్రేమలో పడి తర్వాత బ్రేకప్ కూడా అయ్యింది.
ఇలా ఎన్నో రూమర్స్ తర్వాత మళ్లీ ఆయన పెళ్లికి సంబందించిన ఇష్యూ నెట్టింట్లో షేక్ చేస్తుంది. త్వరలో డీఎస్పీ తమ బంధువులలోని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడంట. దీనికి సంబంధించి నిశ్చితార్థం కూడా అయ్యింది. త్వరలోనే కుటుంబ సభ్యులతో సింపుల్‌గా దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ మరో వార్త వైరల్ అవుతున్నాయి. ఇక దీన్ని డీఎస్పీ అభిమానులు కొట్టి పారేస్తున్నారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూ మండి పడుతున్నారు. ఇక ఇందులో నిజం ఉందో, లేదో తెలియాలంటే దేవీ శ్రీ ప్రసాద్ స్పందించాల్సిందే అంటున్నారు కొందరు.