కోర్టు సీరియస్ అయ్యాక కదలిక..?

కలెక్టర్ కు వినతి పత్రం అందించిన ఆర్వో బిక్షపతి

దిశ దశ, జగిత్యాల కరస్పాండెంట్:

రాష్ట్ర అత్యున్నత స్థానం సీరియస్ అయి రిటర్నింగ్ అధికారిని రికార్డులను తన ముందు ప్రవేశపెట్టాలని డీసీపీని ఆదేశిస్తే తప్ప అధికారుల్లో చలనం రాలేదు. రిటైర్డ్ అయిన రిటర్నింగ్ అధికారి బిక్షపతితో పాటు కౌంటింగ్ కు సంబంధించిన వివరాలన్ని కోర్టులో ప్రోడ్యూస్ ఈ నెల 21న హై కోర్టు ఆదేశించడంతో సదరు అధికారి జగిత్యాల కలెక్టరేట్ వచ్చి వినతి పత్రం అందించారు. జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రకియలో అవకతవకలు జరిగాయని, తాను లీడ్ లో ఉన్నప్పటికీ గెలుపోటములు లెక్కలు తప్పుగా ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హై కోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ రోజున ఫలితాలు వెల్లడిస్తామని చెప్పిన అధికారులు తనను సిగ్నిచర్స్ చేయాలన్నా తాను వినలేదన్నారు. కౌంటింగ్ లో అవకవతవకలు జరిగాయని తనకు అన్యాయం చేస్తున్నారని కౌంటింగ్ సెంటర్లోనే స్పష్టంగా చెప్పినప్పటికీ అప్పటి కలెక్టర్ అక్కడకు చేరుకుని తనను ఒప్పించే ప్రయత్నం చేశారని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కౌంటింగ్ అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదుతో పాటు తాను అభ్యంతరం చేసిన అంశం కూడా ఎన్నికల కౌంటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాల్లో రికార్డు అయిందని కూడా ఆయన కోర్టులో విన్నవించారు. కౌంటింగ్ పేపర్లు. ఈవీఎంలు, పోలింగ్ అయిన ఓట్ల సంఖ్య ఫలితాల్లో చూపించిన ఓంట్ల సంఖ్య పూర్తిగా పరిశీలించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు విచారణ ఆలస్యం జరగగా ఈ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన బిక్షపతి కోర్టుకు రెండు సార్లు హాజరై మరో రెండు సార్లు అటెండ్ కాలేదని లక్ష్మణ్ కుమార్ తరుపు న్యాయవాది హైకోర్టు బెంచ్ ముందు వాదించారు. అంతేకాకుండా గతంలోనే హై కోర్టు జడ్జి ఈ విషయంపై స్ఫష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 21 హై కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి రిటర్నింగ్ అధికారిని, కౌంటింగ్ కు సంబంధించిన రికార్డులను తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని మల్కాజ్ గిరీ డీసీపీని ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న రిటర్నింగ్ అధికారి బిక్షపతి శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి విన్నవించారు. కౌంటింగ్ కు సంబంధించిన రికార్డులు అప్పగించాలని హై కోర్టు ఆదేశించిందని లిఖిత పూర్వకంగా రాసి కలెక్టరేట్ కు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… లక్ష్మణ్ కుమార్ రీ కౌంటింగ్ కోరడంతో ఒక రౌండ్ రీ కౌంటింగ్ చేసి ఆ తరువాత కుదరదని చెప్పేశామని దీంతో ఆయన కోర్టును ఆశ్రయించడంతో ఎంక్వైరి కమిషన్ వేసిందన్నారు. ఈ కమిషన్ కౌంటింగ్ కు సంబంధించిన మెటిరియల్ ఇవ్వాలని ఆదేశించిడంతో తాను కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించానని వెల్లడించారు.

You cannot copy content of this page