దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లా వీఆర్కే కాలేజీలోని ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూం నుండి సేకరించిన రికార్డులు హై కోర్టుకు తరలించారు. స్ట్రాంగ్ రూంలో ఉన్న 17ఏ, 17సి, 17సి పార్ట్ 2 ఫామ్స్ నఖల్లను జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారులు హై కోర్టులో సమర్పించనున్నారు. ఈ వివరాలను బెంచ్ ముందు ఉంచాలని ఇప్పటికే హై కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సోమవారం మద్యాహ్నం 2 గంటల్లోగా సీల్డ్ కవర్లను అందించనున్నారు.
అడ్లూరి పిటిషన్
జగిత్యాల స్ట్రాంగ్ రూంలో జరిగిన తప్పిదాలన్నింటిని క్రోడీకరించి తయారు చేసిన పిటిషన్ ను కూడా ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమర్ హై కోర్టులో వేయనున్నారు. ఇందు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పటికే ఆయన అడ్వకేట్ కు వివరించడంతో ఈ మేరకు ఆయన పిటిషన్ తయారు చేశారు. ధర్మపురి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన కేసు విచారణ కూడా నేడు ఉన్నందున జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారుల వైఫల్యాలు, సీసీ ఫుటేజ్ మిస్సింగ్, స్ట్రాంగ్ రూంలో ట్రంకు బాక్సుల పరిస్థితి తదితర అన్ని అంశాలపై కులంకశంగా పిటిషన్ లో వివరిస్తూ హైకోర్టుకు విన్నవించేందుకు సమాయత్తం అయ్యారు.
సీఈఓకు వినతి
ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వ్యవహారంతో పాటు వీడియో ఫుటేజీలు, సీసీ ఫుటేజీల మిస్సింగ్, స్ట్రాంగ్ రూంలోని ట్రంకు పెట్టెల పరిస్థితి, వాటి కీస్ మిస్సయిన ఘటనలు, ఫామ్స్ 17 వ్యవహారాలకు సంబంధించిన ఫెయిల్యూర్స్ పై ఎన్నికల కమిషన్ సీఈఓ రవికిరణ్ కు కూడా ఫిర్యాదు చేసే యోచనలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి ఉన్నారు. ఇందుకు సంబందించిన అపాయింట్ మెంట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రం సీఈఓ రవికిరణ్ ను కలిసే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post