బ్రాండెడ్ మెటిరియల్ కోసం ధర్నా…

రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఏర్పాటు చేసిన ఆ షాపుల్లో బ్రాండెడ్ మెటిరియల్ లభ్యం కావడం లేదు కానీ… అనుభంద దుకాణాల్లో ఆల్ బ్రాండ్స్ విక్రయిస్తున్నారని, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ షాపులను ఎత్తివేయాలని ఆందోళన నిర్వహించారు. ఏ మెటిరియల్ కు సంబందించిన బ్రాండ్ అనుకుంటున్నారా..? లిక్కర్ బ్రాండ్స్ పై ఆందోళన చేశారండి అక్కడ. ఎక్సైజ్ అధికారులు లైసెన్స్ ఇచ్చిన షాపుల్లో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ఐఎంఎల్ డిపో ద్వారా సరఫరా చేసే అన్ని రకాల బ్రాండ్లను విక్రయించడం లేదంటూ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. కల్తీ మద్యం అమ్మకాల వల్ల చాలామంది అనారోగ్యానికి గురై ప్రాణాలు కూడా వదిలారని ఇలాంటి షాపులను ఎత్తేయడమే మంచిదని ఆందోళనకారులు అభిప్రాయపడ్డారు. ఏకంగా వైన్ షాపు ముందే ఈ నిరసన చేపట్టడం హాట్ టాపిక్ మారింది. మారుమూల కాటారంలో అన్ని రకాల బ్రాండ్ల లిక్కర్ ను కూడా అందుబాటులో ఉంచడం లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో బ్రాండెడ్ కే ప్రియారిటీ ఇస్తున్నప్పుడు లిక్కర్ విషయంలో కూడా ఇదే విధానం పాటించాలన్న భావన వ్యక్తం చేశారు వీరంతా. కల్తీ లిక్కర్ సేవించి ప్రాణాలు పొగొట్టుకోవడం కంటే నాణ్యమైన సరుకు అమ్మాలన్న డిమాండ్ చేసి తమ ఆరోగ్యాలను సేఫ్ గా ఉంచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే వీరు వైన్ షాపు ముందు నిరసన చేపట్టి ఉంటారన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా లిక్కర్ విక్రయాలు జరిపే వైన్ షాపుల్లో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపిన తీరుతో అయినా అధికారుల్లో చలనం వస్తుందో లేదో చూడాలి మరి.

You cannot copy content of this page