సమంతకు నాగచైతన్య నిజంగానే అబార్షాన్ చేయించాడా?

సమంత, నాగచైతన్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలె తెగ వైరల్ అవుతుంది. ఏమాయ చేసావే సినిమాతో ఒక్కటై వీరు, తొలి చూపులో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక టాలీవుడ్‌ లవ్ లీ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా చూడముచ్చటగా ఉండే ఈ జంట పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత మేము విడాకులు తీసుకొని విడిపోతున్నా.. స్నేహితులుగా మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటామని చెబుతూ అందిరికీ షాకిచ్చారు.

దీంతో ఇటు సమంత ఫ్యాన్స్, అటు అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అసలు వీరు ఎందుకు విడిపోయారో తెలియక చాలా మంది ఎన్నో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సామ్, చై విడిపోవడానికి అసలైన కారణం ఇదే అంటూ ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు ఒక సంచలన ట్వీట్ చేశాడు. ఇక ఆయన ట్వీట్ ఏం పెట్టాడంటే.. సమంత నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం నాగచైతన్య. ఆయన మంచి భర్త కాదు, అంతేకాదు సమంతని నాగచైతన్య శారీరకంగా,మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడని,అలాగే సమంత గర్భవతి అయిన కూడా అబార్షన్ చేసుకోవాలని హింసించాడని, ఇక నాగచైతన్య హరాస్మెంట్ తట్టుకోలేకే సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందని, ఈ విషయాన్నే సామ్ తనకు చెప్పిందంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై అక్కినేని అభిమానలు మండిపడుతూ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. కాగా, దీనిపై అటు సమంత కానీ, ఇటు నాగచైతన్య కానీ స్పందించలేదు. ఇద్దరిలో ఎవరైనా ఒకరు స్పందించినా దీనిపై క్లారిటీ వస్తుందని, పలువురు ముచ్చటిస్తున్నారు.

You cannot copy content of this page