లాస్య కోసమే రవి తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాడా?

యాంకర్ రవి, లాస్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. సంథింగ్ స్పెషల్ అనే సినిమా ద్వారా వీరు ఎంతో పాపులారిటీ సంపాదించారు. అప్పట్లో ఎవరి నోట చూసినా రవి, లాస్య పేరే బాగా వినిపించేది. వీరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉండేది.

దీంతో వీరికి చాలా అవకావాలు వచ్చాయి. వీరి కలిసి ఎన్నో షోలు నిర్వహించారు. ప్రీ రీలీజ్ ఈవెంట్స్ చేశారు. ఇక వీరు కలిసి ఏ షో చేసినా అప్పట్లో అది పెద్ద హిట్ అయ్యేది అంటే చెప్ప కోవచ్చు వీరు ఎలా ప్రేక్షకులను అలరించేవారో. తర్వాత రవి, లాస్యను ప్రేమిచాడని చాలా వార్తలు వచ్చాయి. అంతే కాదు తన ప్రేమను రవి లాస్యకు తెలిపాడని, కానీ లాస్య ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదంటూ అనేక వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బాడింగ్ కాస్త తగ్గిందనే చెప్పవచ్చు.

అయితే రవి చాలా రోజు తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టాడు. కాగా, తాజాగా ఆయన తన పెళ్లిని రహస్యంగా ఉంచడంపై ఆసక్తికర విషయాలు తెలిపాడు.తనకి పెళ్లి ఎప్పుడో జరిగిందని, కానీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారట.ఎందుకంటే పెళ్లి కాలేదు అని తెలిస్తేనే యాంకర్లకి జనాల్లో ఆదరణ ఉంటుందని,ఒకవేళ పెళ్లయింది అని తెలిస్తే అంకుల్స్ అని భావిస్తారని,అందుకే తన పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచానని పేర్కొన్నాడు. అలాగే లాస్య కి తనకి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, మేము ఇద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తాను ఏ అమ్మాయితో షో చేసినా వారితో రిలేషన్ షిప్ అంటగట్టే వారని, అది నాకెరీర్‌కు, నాకు ఇబ్బందికరంగా మారింది. అందుకే నా పెళ్లి విషయాన్ని బయట పెట్టాను అంటూ కుండలు బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే మరో వైపు, రవి లాస్యను ప్రేమించాడు, ఆమె కోసమే తనకు పెళ్లైన విషయాన్ని బయట పెట్టకుండా, రవి సీక్రెట్‌గా ఉంచాడంటూ నెటిజన్లు ముచ్చటిస్తున్నారు.

You cannot copy content of this page