అభూజామఢ్ లో అసలేం జరుగుతోంది..? బలగాలు కీకారణ్యాలపై పట్టు బిగించాయా..? దిశ దశ, దండకారణ్యం: భారతదేశంలోనే దట్టమైన అటవీ ప్రాంతాలకు పెట్టింది పేరు… అక్కడ అడవులు ఏ స్థాయిలో విస్తరించి ఉన్నాయంటే.. ఆ ప్రాంతం పేరే దండకారణ్యం అని పడిపోయింది. అంటే ఆ కీకారణ్యలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంపై పట్టు బిగించిన మావోయిస్టులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విప్లవ చరిత్రలోనే ఓ సువర్ణధ్యాయాన్ని లిఖించుకుంది మావోయిస్టు పార్టీ. పీపుల్స్ వార్ గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంపై కన్నెసి ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. క్రాంతికారీ జనతన్ సర్కార్ పేరిట మావోయిస్టులు ప్రత్యేకంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. అక్కడకు బలగాలు వెళ్లాలంటే ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యమని అనుకున్న పరిస్థితుల నుండి అక్కడి అటవీ ప్రాంతాల్లో బలగాలు పై చేయి సాధిస్తుండడం సంచలనంగా మారింది. ఒకప్పుడు ఆ అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారంటే ఎన్ని శవాలు తిరిగి వస్తాయోనన్న ఆందోళన బలగాల్లో ఉండేది. ఇప్పుడా పరిస్థితికి భిన్నంగా సాగుతున్నట్టుగా ఉంది. గత జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 150 మంది వరకు మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతం కాగా వందల సంఖ్యలో నక్సల్స్ లొంగుబాట వైపు సాగుతున్నారు. భయానక పరిస్థితుల నుండి… గత జనవరి నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో భారీ స్థాయిలో మావోయిస్టులకు ప్రాణ నష్టం జరిగింది. కీలక నాయకులను ఎదురు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు వదులుతున్న తీరు ఆ పార్టీలో ఆందోళన కల్గిస్తోంది. దండకారణ్యంలో ఆధిపత్యంతో కేంద్ర బలగాలను మట్టుబెట్టడం, క్యాంపులపై దాడులు, కవ్వింపు చర్యలకు పాల్పడి ముప్పేట దాడి చేసి బలగాలను హతమారుస్తూ వారిలో మానిసిక స్థైర్యాన్ని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యాయి. అభూజామడ్ గుట్టలు, భారీ స్థాయిలో ఎదిగిన వృక్ష సంపద విస్తరించిన ఉన్న పూర్వ బస్తర్ జిల్లాలో మావోయిస్టులకు అన్ని రకాలుగా కలిసివచ్చిన విషయం అక్కడి ఆదివాసీలు అక్కున చేర్చుకోవడం. దీంతో అక్కడి అడవులపై అణువు అణువు అవగాహన పెంచుకోవడంలో సక్సెస్ అయిన మావోయిస్టులు ట్రెడిషనల్ ఆర్మ్ ద్వారా బలగాలను మట్టుబెడుతూ ఆ ప్రాంతంపై తమకు తిరుగులేదని పలుమార్లు నిరూపించారు. అయితే కేంద్ర, రాష్ట్ర బలగాలు కూడా ఇదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేయడం మొదలు పెట్టాయి. పీఎల్జీఏలో కీలక నేతగా ఉన్న హిడ్మా స్వగ్రామంలో క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు, గతంలో 78 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రామాలయాన్ని తెరిపించే స్థాయికి చత్తీస్ గడ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న బలగాలు చేరుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి చొచ్చుకపోయిన బలగాలు వందలాదిగా క్యాంపులను ఏర్పాటు చేయడంలో అక్కడి అధికారులు సఫలం అయ్యారు. ఈ క్రమంలో గత జనవరి నుండి కూడా మావోయిస్టులపై దాడులు చేయడంలో బలగాలు సఫలం అవుతున్నాయి. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర బలగాలు కీకారణ్యంలో మావోయిస్టుల షెల్టర్ జో్న్లను ట్రేస్ చేసి మరి వేటాడుతున్నాయి. బస్తర్ జిల్లా టార్గెట్ గా… బస్తర్ ఉమ్మడి జిల్లా టార్గెట్ చేసుకున్న బలగాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను కవర్ చేస్తూ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో చేపడుతున్న జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు వ్యూహాత్మకంగా ఏరివేతలో పాల్గొంటున్నాయి. సోలార్ సిస్టం ద్వారా సీసీ కెమరాలను కూడా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు అక్కడి పోలీసు అధికారులు. కీకారణ్యాల్లోని చెట్లకు వీటిని అమర్చి అటవీ ప్రాంతంలో ఏం జరుగుతుందోనన్న విషయంపై అవగాహన చేసుకునే ప్రయత్నం చేశారు. రహదారి సౌకర్యాలను మెరుగు పరుస్తూనే ఆదివాసీలను మచ్చిక చేసుకోవడం కూడా ఆరంభించారు. దీంతో పాటు డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా, సీ 60, గ్రే హౌండ్స్ పేరిట ఏర్పాటు చేసిన బెటాలియన్స్ అన్ని కూడా కేవలం నక్సల్స్ ఏరివేత కోసమే పనిచేస్తున్నాయి. బస్తర్ ఫైటర్స్ కోసం ప్రత్యేకంగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చొరవ తీసుకుని మరీ ప్రభుత్వం నుండి సానుకూల ఉత్తర్వులు ఇప్పించుకుని నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బస్తర్ ఫైటర్స్ కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన పోలీసు అధికారులు, ఇందులో రిక్రూట్ చేసుకునే వారు కేవలం బస్తర్ అటవీ ప్రాంతాలకు చెందిన వారై ఉండే విధంగా చొరవ తీసుకున్నారు. దీంతో కూంబింగ్ ఆపరేషన్లలో మావోయిస్టుల డెన్ లను ట్రేస్ చేసేందుకు అక్కడి అటవీ ప్రాంతాలపై పట్టు బిగించగలిగారు.

దిశ దశ, దండకారణ్యం:

భారతదేశంలోనే దట్టమైన అటవీ ప్రాంతాలకు పెట్టింది పేరు… అక్కడ అడవులు ఏ స్థాయిలో విస్తరించి ఉన్నాయంటే… ఆ ప్రాంతం పేరే దండకారణ్యం అని పడిపోయింది. అంటే ఆ కీకారణ్యలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంపై పట్టు బిగించిన మావోయిస్టులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విప్లవ చరిత్రలోనే ఓ సువర్ణధ్యాయాన్ని లిఖించుకుంది మావోయిస్టు పార్టీ. పీపుల్స్ వార్ గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంపై కన్నెసి ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. క్రాంతికారీ జనతన్ సర్కార్ పేరిట మావోయిస్టులు ప్రత్యేకంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. అక్కడకు బలగాలు వెళ్లాలంటే ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యమని అనుకున్న పరిస్థితుల నుండి అక్కడి అటవీ ప్రాంతాల్లో బలగాలు పై చేయి సాధిస్తుండడం సంచలనంగా మారింది. ఒకప్పుడు ఆ అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారంటే ఎన్ని శవాలు తిరిగి వస్తాయోనన్న ఆందోళన బలగాల్లో ఉండేది. ఇప్పుడా పరిస్థితికి భిన్నంగా సాగుతున్నట్టుగా ఉంది. గత జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 150 మంది వరకు మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతం కాగా వందల సంఖ్యలో నక్సల్స్ లొంగుబాట వైపు సాగుతున్నారు.

భయానక పరిస్థితుల నుండి…

గత జనవరి నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో భారీ స్థాయిలో మావోయిస్టులకు ప్రాణ నష్టం జరిగింది. కీలక నాయకులను ఎదురు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు వదులుతున్న తీరు ఆ పార్టీలో ఆందోళన కల్గిస్తోంది. దండకారణ్యంలో ఆధిపత్యంతో కేంద్ర బలగాలను మట్టుబెట్టడం, క్యాంపులపై దాడులు, కవ్వింపు చర్యలకు పాల్పడి ముప్పేట దాడి చేసి బలగాలను హతమారుస్తూ వారిలో మానిసిక స్థైర్యాన్ని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యాయి. అభూజామడ్ గుట్టలు, భారీ స్థాయిలో ఎదిగిన వృక్ష సంపద విస్తరించిన ఉన్న పూర్వ బస్తర్ జిల్లాలో మావోయిస్టులకు అన్ని రకాలుగా కలిసివచ్చిన విషయం అక్కడి ఆదివాసీలు అక్కున చేర్చుకోవడం. దీంతో అక్కడి అడవులపై అణువు అణువు అవగాహన పెంచుకోవడంలో సక్సెస్ అయిన మావోయిస్టులు ట్రెడిషనల్ ఆర్మ్ ద్వారా బలగాలను మట్టుబెడుతూ ఆ ప్రాంతంపై తమకు తిరుగులేదని పలుమార్లు నిరూపించారు. అయితే కేంద్ర, రాష్ట్ర బలగాలు కూడా ఇదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేయడం మొదలు పెట్టాయి. పీఎల్జీఏలో కీలక నేతగా ఉన్న హిడ్మా స్వగ్రామంలో క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు, గతంలో 78 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రామాలయాన్ని తెరిపించే స్థాయికి చత్తీస్ గడ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న బలగాలు చేరుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి చొచ్చుకపోయిన బలగాలు వందలాదిగా క్యాంపులను ఏర్పాటు చేయడంలో అక్కడి అధికారులు సఫలం అయ్యారు. ఈ క్రమంలో గత జనవరి నుండి కూడా మావోయిస్టులపై దాడులు చేయడంలో బలగాలు సఫలం అవుతున్నాయి. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర బలగాలు కీకారణ్యంలో మావోయిస్టుల షెల్టర్ జో్న్లను ట్రేస్ చేసి మరి వేటాడుతున్నాయి.

బస్తర్ జిల్లా టార్గెట్ గా…

బస్తర్ ఉమ్మడి జిల్లా టార్గెట్ చేసుకున్న బలగాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను కవర్ చేస్తూ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో చేపడుతున్న జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు వ్యూహాత్మకంగా ఏరివేతలో పాల్గొంటున్నాయి. సోలార్ సిస్టం ద్వారా సీసీ కెమరాలను కూడా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు అక్కడి పోలీసు అధికారులు. కీకారణ్యాల్లోని చెట్లకు వీటిని అమర్చి అటవీ ప్రాంతంలో ఏం జరుగుతుందోనన్న విషయంపై అవగాహన చేసుకునే ప్రయత్నం చేశారు. రహదారి సౌకర్యాలను మెరుగు పరుస్తూనే ఆదివాసీలను మచ్చిక చేసుకోవడం కూడా ఆరంభించారు. దీంతో పాటు డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా, సీ 60, గ్రే హౌండ్స్ పేరిట ఏర్పాటు చేసిన బెటాలియన్స్ అన్ని కూడా కేవలం నక్సల్స్ ఏరివేత కోసమే పనిచేస్తున్నాయి. బస్తర్ ఫైటర్స్ కోసం ప్రత్యేకంగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చొరవ తీసుకుని మరీ ప్రభుత్వం నుండి సానుకూల ఉత్తర్వులు ఇప్పించుకుని నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బస్తర్ ఫైటర్స్ కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన పోలీసు అధికారులు, ఇందులో రిక్రూట్ చేసుకునే వారు కేవలం బస్తర్ అటవీ ప్రాంతాలకు చెందిన వారై ఉండే విధంగా చొరవ తీసుకున్నారు. దీంతో కూంబింగ్ ఆపరేషన్లలో మావోయిస్టుల డెన్ లను ట్రేస్ చేసేందుకు అక్కడి అటవీ ప్రాంతాలపై పట్టు బిగించగలిగారు.

You cannot copy content of this page