కవిత ఇంటరాగేషన్ జరిగిందిలా..

వైరల్ అవుతున్న క్వశ్వన్స్

రెండో రోజు ఈడీ టీం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇంటరాగేషన్ చేసిందా లేక కవితే ఈడీ అధికారులను ప్రశ్నలతో ముంచెత్తారా..? ఇంతకీ ఆఫీసులో ఏం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు దాదాపు అందరిని వెంటాడుతూనే ఉన్నాయి. ఉత్కంఠత మధ్య సాగుతున్న కవిత విచారణ సోమారం రాత్రి 9.15 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుండి నెట్టింట వైరల్ అవుతున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత ఉదయం 11 గంటల నుండి విచారణ ఎదుర్కొన్నారని సోమవారం ప్రచారం జరిగింది. అయితే ఈడీ ఆఫీసులో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన తీరు చోటు చేసుకుందని వాట్సప్ గ్రూపుల్లో షేర్ అవుతున్న పోస్టులు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో వివిధ గ్రూపుల్లో షేర్ అవుతున్న ఈ మ్యాటర్ సారాంశం అంతా డిఫరెంట్ గా ఉంది. ‘‘11 గంటలు – 14 ప్రశ్నలు’’ పేరిట షేర్ అవుతున్న ఈ పోస్ట్ సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఎమ్మెల్సీ కవిత సహాయ నిరాకణ చేస్తున్నారని చిత్రీకరించే కుట్ర సాగుతోందని, ఇప్పటి వరకు ఎవ్వరితోనూ కన్ ఫ్రంట్ చేయలేదని, లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పాత్రకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ ఈడీ చూపించలేదని, రాజకీయ ఒత్తిడిలో భాగంగనే ఈడీ విచారిస్తోందంటూ ఈ స్క్రిప్ట్ తేట తెల్లం చేస్తోంది. ఎమ్మెల్సీ కవిత వేసిన ప్రశ్నలకే ఈడీ అధికారులు నీళ్లు నమిలారని, సుప్రీం కోర్టులో తన పిటిషన్ విచారణలో ఉండగా ఇంత తొంతరగా విచారించడానికి కారణాలేంటని ఎమ్మెల్సీ కవితే విచారణ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారంటూ నెట్టింట పోస్టు వైరల్ అవుతోంది. ఇందుకు సంబందించిన పూర్తి మ్యాటర్ ‘దిశ దశ’ పాఠకుల కోసం ప్రత్యేకం..

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

11 గంటలు – 14 ప్రశ్నలు

పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తున్నప్పటికీ సహాయ నిరాకరణగా చిత్రీకరించే కుట్ర

ఇప్పటివరకు ఎవ్వరితో కూడా కన్ఫ్రంట్ చేయని అధికారులు

ఎమ్మెల్సీ కవిత పాత్రకు సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా చూపెట్టలేకపోయినా ఈడి… ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారించిన ఈడి

నేను ఎలాంటి తప్పు చేయలేదు.. ఇది కేవలం రాజకీయ కుట్ర అని కుండబద్ధలు కొట్టిన కవిత

రాజకీయ ఒత్తిడితో ఈడి పారదర్శకత లోపించిందని ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్

కేవలం పొలిటికల్ లైన్ లో ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు

నన్ను నిందితురాలుగా పిలిచారా అని ఈడి ఆఫీసర్లను ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.. కాదు అని నీళ్ళు నమిలిన అధికారులు

విచారణకు పిలిచి ఎలాంటి కన్ఫ్రంటేషన్ చేయకుండా పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో విచారణ చేసిన అధికారులు

తాను విచారణకు సంపూర్ణగా సహకరిస్తున్నానని నొక్కి చెప్పిన కవిత

సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన కవిత

గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అధికారులకు స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత

తను ఫోను ధ్వంసం చేసినట్టు మీడియా కి లీకులు ఎవరు చెప్పారని ఈడి అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.. ఖంగుతిన్న అధికారులు

బిజెపిలో చేరగానే మరుగునపడ్డ కేసుల గురించి ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో నీళ్లు నమిలిన అధికారులు..

బీజేపీ లో చేరాక మరుగున పడ్డ హిమంతా బిశ్వ శర్మ సుజనా చౌదరి నారాయణరాణి కేసులను ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత

ఈడి కార్యాలయానికి చేరుకున్న గంట వరకు రాని అధికారులు..

గంటలపాటు రూమ్ లో ఒకరిని కూర్చోబెట్టి మానసికంగా హించించిన కార్యక్రమం చేసిన ఈడి అధికారులు

ఈడి అధికారుల విచారణలో పారదర్శకత లేదు

వాట్సప్ గ్రూప్ స్క్రీన్ షాట్లు ఇవి

You cannot copy content of this page