మండూక్ మందిర్… ప్రంపంచంలోనే ఏకైక ఆలయం

దిశ దశ, జాతీయం:

కూపస్త ముండూకం అన్న నానుడి వినే ఉంటాం. అంటే బావిలో కప్ప అన్న మాట… సాధారణంగా బాహ్య ప్రపంచం గురించి తెలియక తామే గొప్పవాళ్లమనే భ్రమల్లో ఉండే వారిని ఉదహరించి బావిలో కప్పలాంటి వాళ్లు అంటుంటారు. ఎందుకంటే బావిలో ఉన్న కప్ప తాను ఉన్నదే విశాలమైన ప్రపంచం అని భ్రమిస్తుంటుంది… బయటకు వచ్చి చూస్తే అంతకాన్న సువిశాలమైన ప్రపంచం ఉంది అని తెలుస్తుంది అనే ఉద్ధేశ్యంతో అంటుంటారు. అయితే అలాంటి కప్పలకూ ఓ ఆలయం ఉంది తెలుసా… సువిశాలమైన ప్రదేశంలో నిర్మించిన ఈ ఆలయంలో అలనాటి శిల్పుల కళాత్మకతకు దర్పణంగా నిలుస్తోందని తెలుసా..? ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది..? కప్పల కోసం ఆలయం ఎందుకు కట్టించాల్సి వచ్చింది అంటే మీరీ స్టోరీ చదవాల్సిందే…

లఖింపూర్ ఖేరీ…

1860-70వ కాలంలో నిర్మించిన ఈ ఈలయానికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ జిల్లాలో ఓల్‌ పట్టణంలో ‘మండూక్‌ మందిర్‌’ ఉంది. ఈ ఒకప్పుడు ఈ ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తుండడంతో ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను రక్షించేందుకు గానూ చహమనా రాజవంశానికి చెందిన రాజా బఖత్ సింగ్ కప్పలకు ప్రత్యేక పూజలు చేసేవారు. ఆయన రోజూ మండూకాలకు పూజ చేస్తున్న క్రమంలో వాటి కోసం ప్రత్యేకంగా ఓ ఆలయాన్ని నిర్మించాలని భావించి ‘మండూక్‌ మందిర్‌’ కట్టించారు. ఈ ఆలయం ముందు భారీ సైజులో కప్ప ఆకారాన్ని చెక్కించారు. అయితే ఆలయం లోపల మాత్రం నర్మదాకుండ్‌ నుండి ప్రత్యేకంగా తెప్పించిన శివలింగం ప్రతిష్టించారు. అది ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటుందని స్థానికులు చెప్తుంటారు. సాధారణంగా శైక క్షేత్రాలల్లో శివుని వాహనం నంది ఆయనకు ఎదురుగా కూర్చుని ఉండేలా నిర్మాణం చేస్తారు. కానీ ఈ ఆలయంలొ బాతంకం నంది నిలబడి ఉండడం గమనార్హం. అడుగడుగునా శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతుటుంటుంది. ఆలయం వెనక భాగంలో మొసలిపై కప్ప స్వారీ చేస్తున్న శిల్పాన్ని కూడా చెక్కించారు. అంతేకాకుండా వివిధ దేవతల రూపాలను కూడా ఆలయంలో చెక్కించడం గమనార్హం. సంతానం లేని వారు ఈ ఆలయాన్ని సందర్శించినట్టయితే కడుపు పండుతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. శ్రావణ మాసం, శివరాత్రి, దీపావళి పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వంద అడుగుల ఎత్తులో అష్టాదళ తామర ఆకారంలో నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రపంచంలోనే కప్ప పేరిట ఓ ఆలయం ఉండడం ఇక్కడే అని చరిత్ర చెబుతోంది. అయితే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుండి సుమారు 135 కిలో మీటర్ల దూరంలో ఉండే ఓల్ పట్టణానికి వెల్లేందుకు రోడ్ మార్గాలు ఉన్నాయి. ముందుకు లిఖింపూర్ చేరుకుని అక్కడి నుండి 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న మండూక్ మందిర్ కు చేరుకోవల్సి ఉంటుంది. లిఖింపూర్ వద్ద ప్రైవేటు వాహనాలు, బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. స్థానికులు ఎంతో ప్రాశస్త్యంగా భావించే ఈ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు.

You cannot copy content of this page