శివయ్య సన్నిధిలో శ్రీనివాసులు

ఎక్కడ మొక్కులు తీర్చుకోవాలన్నా ముందిక్కడ దర్శనం చేసుకునే ఆనవాయితీ తరతరాలుగా కొనసాగుతోందక్కడ. మేడారం సమ్మక్క, సారలక్క అయినా, తిరుపతి వెంకన్న అయినా శ్రీశైలం మల్లన్న అయినా ఇలా ఏ గుడికి వెల్లినా ముందుగా కొడెమొక్కుల వాడి సన్నిధికి వెల్లి దండం పెట్టి అనుమతి తీసుకుంటుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులూ ఈ సాంప్రాదాయాన్ని పాటిస్తున్నారు. పేదోల్లకు పెద్దదిక్కుగా నిలిచే వేములవాడ రాజన్న విషయంలో తరతరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే రాజన్న వెలిసిన ఈ పట్టణంలో మాత్రం శ్రీనివాసులే ఎక్కువగా ఉంటారు. ఏడు కొండలపై వెలిసిన శ్రీనివాసున్ని తల్చుకుంటూ జీవిస్తుంటారక్కడ. కాస్తా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం.

స్పెషాలీటీ ఇది…

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం చాళుక్యుల కాలంలో రాజధానిగా వెలుగొందింది. శ్రీ రాజ రాజేశ్వరుని రూపంలో ఇక్కడ వెలిసిన భోళా శంకరుడు భక్తులకు కొంగుబంగారమై నిలుస్తుంటారని ప్రతీతి. మహిమాన్వితుడైన శివయ్య సన్నిధిలో జీవిస్తున్న వారు మాత్రం నిత్యం తిరుపతి వెంకన్న పేరునే తల్చుకుంటుంటారు. వెంకటేశ్వరునికి వివిధ పేర్లలో శ్రీనివాసుడు ఒకటి కాగా వేములవాడలో పుట్టిన వారిలో చాలామందికి ఈ పేరు పెట్టుకుంటుంటారు. తిరుపతి, శ్రీనివాస్ ఈ రెండు పేర్లు పెట్టుకున్న వారు వేములవాడలో సర్వ సాధారణంగా కనిపిస్తుంటారు. పట్టణంలో నివసిస్తున్న వారిలో 50 నుండి 60 శాతం మంది పేర్లు శ్రీనివాస్ లేదా తిరుపతి అనే ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో నిత్యం శ్రీనివాసుని నామస్మరణ ఈ రకంగా జరుగుతూనే ఉంటుందన్నది నిజం.

ఎందుకలా…

అయితే వేములవాడలో ఉన్న వారిలో చాలా మంది కూడా ఏడుకొండలపై వెలిసిన వెంకన్నను స్మరించుకుంటూ జీవించడం వెనక అసలు కారణం ఏంటన్న విషయంపై వివిధ రకాలుగా చెప్తున్నారు. అల్లంత దూరాన వెలిసిన తిరుపతి వెంకన్న పేరు పెట్టుకుని తమ వారసులకు మంచే జరుగుతుందన్న నమ్మకం కొందరిది. తరతరాలుగా శ్రీనివాసుని పేరు పెట్టుకోవడం ఆచారంగా వస్తుందని మరికొందరు చెప్తుంటే, కలియుగ అవతారం అయిన వెంకన్న స్మరణ మాత్రం వేములవాడ రాజన్న సన్నిధిలో నిత్యకృత్యమనే చెప్పాలి. ఏది ఏమైనా ఆది భిక్షువు వెలిసిన చోట శ్రీనివాస్, తిరుపతి అనే పేర్లతో ఎక్కువ మంది ఉండడం మాత్రం ఇక్కడ వైవిద్యతను చాటుతోందని చెప్పక తప్పదు.

You cannot copy content of this page