దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
ఎన్నికల వేళ అధికార పార్టీలో ట్విస్టుల మీదు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ దక్కించుకునేందుకు నాయకులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు దేశ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ బీఆర్ఎష్ గా ఆవిర్భవించిన తరువాత సొంత రాష్ట్రంలో అభ్యర్థుల ప్రకటన సంచలనంగా మారనుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జాబితాలో ఫలానా వారి పేరుండకపోవచ్చని… ఫలనా వారి పేరు ఉండోచ్చంటూ చేస్తున్న జరుగుతున్న ప్రచారం ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి కొన్ని గంటల్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి జాబితా విడుదల చేయనున్నారు. అయితే సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన భావాలు… ఒక రోజు ముందు ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న చల్మెడ లక్స్మీనరసింహ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చల్మెడ వ్యాఖలు ఇలా…
రాజన్న సిరిసిల్ల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కెటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో దేవునికి ఏర్పాటు కానీ… ముఖ్యమైన మంత్రి మాత్రం ఆయనేనని… ఫండ్స్ కు కొదవ లేదని, అభివృద్ది పనులకు సంబంధించిన పనులు మంజూరు చేయించుకోవడం పెద్ద పని కాదు… కానీ సంబంధిత అధికారుల నుండి ఇందుకు సంబంధించిన ఫైల్ కదలాల్సి ఉంటుందన్నారు. మొన్ననే తక్కళ్ళపల్లి బ్రిడ్జి మంజూరైన పనులు ప్రారంభం కాలేదని… రాజకీయాల్లో సునిశత దృష్టితో ముందుకు సాగాల్సి ఉంటుందని, జాగ్రత్తగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సి ఉందున్నారు. నా కష్ట సుఖాల్లో మిమ్మల్ని ఎలా చూసుకోవాలని కలలు కంటారే మేము కూడా అదే పరిస్థితిలో ఉండాల్సి ఉందని… నన్ను నమ్మండి…ఇంత కాలం పొగొట్టుకున్నామన్న అభిప్రాయాల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత తనపై ఉంటుందన్నారు. మండలాల్లోని కార్యాలయాల్లో మీకు గౌరవం పెంపొందించే విధంగా చొరవ తీసుకుంటానని. భయభ్రాంతుల మధ్య బ్రతుకుతున్న ఉన్న మీకు భరోసా ఇస్తాను… ఫోన్ చేయండి నాకు పీఏలు ఉండరు… నేనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతా… నన్ను గల్లా పట్టుకుని నిలదీసే స్వేచ్ఛను మీకు ఇస్తానని లక్ష్మీనరసింహరావు వ్యాఖ్యానించారు.
భావోద్వేగంతో…
మరో వైపున జర్మనిలో ఉన్న వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెేన్నమనేని రమేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తనలోని భావోద్వేగాన్ని పంచుకున్నారు. నిన్ననే మా సంగీత డాక్టరమ్మ అయింది… ఈ సందోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను… ఇక రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి, పదవుల కోసం కాదు అని చెప్పిన మా తండ్రి గారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటూ తుది శ్వాస వరకూ ఇదే పని చేస్తానని నాతో ఉన్న వారందరికీ భరోసా ఇస్తున్నానన్నారు. దయచేసి నిర్ణయాలు అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణ:గా తీసుకోవాలి, లేని పక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి… ప్రజల ఆమోదం లభించదు, ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం అంటూ తన ఎఫ్ బి అకౌంట్ లో పోస్ట్ చేశారు.
ఇప్పటికే రమేష్ బాబుకు టికెట్ రాదన్న ప్రచారం జరుగుతుండడం, ఆదివారం చల్మెడ లక్ష్మీ నరసింహరావు చేసిన వ్యాఖ్యలు దాదాపు తన అభ్యర్థిత్వం ఖరారు అయిందన్న రీతిలో ప్రసంగించడం ఒక ఎత్తైతే… కొద్ది సేపటి క్రితం చెన్నమనేని రమేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.