ధిక్కార స్వరంపై క్రమ శిక్షణా చర్యలు: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీలో కలకలం

దిశ దశ, హుజురాబాద్:

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ముసలం చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ ప్రణవ్ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని కూడా అధిష్టానం తప్పు పట్టింది. పార్టీ అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలు రచ్చకెక్కెలా వ్యవహరించాడన్ని పీసీసీ క్రమ శిక్షణా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ లైన్ తప్పుతూ వ్యవహరించడం సరికాదని ఆరుగురు పార్టీ నాయకులపై ఏకంగా బహిష్కరణ వేటు వేయడం చర్చనీయాంశంగ మారింది. వీరంతా కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జమ్మికుంటకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో బహిష్కరణ వేటు వేసినట్టుగా పార్టీ పేర్కొంది. బహిష్కరణకు గురైన వారిలో జమ్మికుంట పట్టణానికి చెందిన కసుబోజుల వెంకన్న, ఒళ్ళాల శ్రీనివాస్, ఎండి. సలీం, ఎండి. ఇమ్రాన్, ఎండి సలీం పాషా, వాసాల రామస్వామిలు ఉన్నారు. మరో వైపున జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డికి కూడా పార్టీ అధిష్టానం శ్రీముఖం జారీ చేసిందిన పార్టీ ఇంఛార్జి ప్రణవ్ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరును తప్పు పట్టిన అధిష్టానం వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సమ్మిరెడ్డిని ఆదేశించింది. ఒకే రోజు జమ్మికుంటకు చెందిన పార్టీ నాయకులపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ప్రణవ్ బాబును కాదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయన్న సంకేతాలు తాజాగా తీసుకున్న నిర్ణయం చెప్పకనే చెప్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఓపెన్ టాక్ విషయంలో చర్యలు తీసుకున్న సంధర్బాలే లేవు. కానీ తాజాగా సస్పెన్షన్లు, షోకాజులు ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టడం సంచలనంగా మారింది.

You cannot copy content of this page