మరో పోలీసు తీరుపై చర్చ… నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లాలో ఓ పోలీసు అధికారి వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నెట్టింట వైరల్ అవతున్న ఈ ఫోటోలు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హోలీ వేడుకలు జరుపుకుంటున్న వారూ కూడా ఇదే అంశం గురించి చర్చిస్తున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ పోలీసు ఆఫీసర్ మరో మహిళతో చనువుగా ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం నుండే ఈ ఫోటోలు మెట్ పల్లి ప్రాంతంలోని పలువురి వాట్సప్ లలో షేర్ అవుతున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయంలో జిల్లా పోలీసు అధికారులకు కూడా తెలిసినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసు విభాగానికి చెందిన అధికారులు నిమగ్నం అయ్యారని తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఓ గొడవకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులను ఆశ్రయించడంతో చనువు ఏర్పడినట్టుగా పోలీసు అధికారులు గుర్తించినట్టుగా తెలిసింది. అయితే సదరు పోలీసు అధికారి కూడా రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారని తెలుసుకున్న పోలీసు అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయించేందుకు వచ్చిన బాధితులతో గౌరవంగా వ్యవహరించాల్సింది పోయి భిన్నమైన తీరును ప్రదర్శిస్తుండడంపై జిల్లా పోలీసు అధికారులు కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page