దిశ దశ, హైదరాబాద్:
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కలకలం లేచిన ఓ కరపత్రం ఇప్పుడు పోలీసు బ్యాచుల మధ్య సరికొత్త చర్చకు దారి తీసిన్నట్టుగా తెలుస్తోంది. ఫలనా బ్యాచ్ అంటూ పేర్కొన్న అంశాలపై తర్జన భర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసు విభాగంలోనే సంచలనంగా మారిన ఈ కరపత్రం గురించి కొన్ని బ్యాచుల మధ్య మాటల యుద్దం సాగుతున్నట్టుగా సమాచారం. కరపత్రంలో ఉన్న విషయాలపై తర్జనభర్జనలు సాగిస్తున్న వారు ఈ కరపత్రం తీసింది ఫలనా బ్యాచ్ వారేనంటే మాకేం సంబంధం లేదని మరో బ్యాచు వారు… మరో బ్యాచ్ వారయి ఉంటారని మరోకరు ఇలా చర్చలు కొనసాగిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పోలీసు వ్యవస్థలోనే అరుదుగా జరిగే ఇలాంటి ఘటనలపై సీరియస్ గానే డిస్కషన్ సాగుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం తమ బ్యాచ్ వారినే టార్గెట్ చేసి కరపత్రాలు తీయడం ఎంత వరకు సమంజసం అంటూ వాదిస్తుండగా, ఇలాంటి విషయాలు బయటకు పొక్కడం కాదంటూ మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరపత్రం గురించి మీడియాలో వెలుగులోకి రాగానే వివిధ బ్యాచు పోలీసు అధికారులకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ సాగినట్టుగా సమాచారం. అయితే కరపత్రంలో ఉన్న విషయాలు ఎంత వరకు వాస్తవాలు అన్న అంశం పక్కకు పోయి దీనిని ఎవరు తయారు చేశారోనన్న విషయంపై మల్లగుల్లాలు పడుతుండడం గమనార్హం.