నవరసనట సార్వ భౌముడు సీనీ రంగంలో వైవిద్యమైన పాత్రలకు జీవం పోసిన తొలితరం నటుడు కైకాల సత్యనారయణ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. సాంఘీక, పౌరాణిక సినిమాల్లో వివిధ రకాల పాత్రల్లో నటించిన కాదు కాదు జీవించిన కైకాల అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. అమాయక చక్రవర్తిగా అయినా, విలన్ పాత్రే అయినా, పారిశ్రామిక వేత్తగా అయినా, యముని పాత్రలో అయినా ఆయన నటనకు ఎవరూ సాటి రారేమో. సిని రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన కైకాల వెండి తెరపై వేసిన చెరగని ముద్ర కొన్ని తరాల వరకూ నిలిచిపోతుంది. నాటి తరం ఎన్టీ రామారావు, ఏఎన్నార్, కృష్ణల నుండి నేటి తరానికి చెందిన వారితోనూ సినిమాల్లో నటించిన గొప్ప చరిత్ర ఆయనది. ఆరు దశాబ్దాల పాటు సినిమా రంగానికి సేవలందించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నటుడు.
ధూంతత…
ధూంతత ధూంతత ధూం అంటూ యముని పాత్రలో నటించిన కైకాల అందరిని అబ్బురపరిచారు. మరణానంతంరం భూ లోకంలో చేసిన పాపాలకు ప్రాయచిత్తం అనుభవించిందేకు మయలోకం ఉంటుందని చెప్తుంటారు. తప్పులు చేసిన వారికి శిక్షించేందుకు ఉండే యమలోకానికి అధిపతిగా యముడు ఉంటాడని కూడా అంటుంటారు. ఈ లోకాధిపతిగా కైకాల సత్యనారాయణ నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా కథ, హిరో హీరోయిన్లతో పోటీ పడి మరీ యముని పాత్రలు సమాజాన్ని ఆకట్టుకున్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఆయన నటన ప్రదర్శనతోనే యముని పాత్రకు తెలుగు నాట ప్రత్యేక గుర్తింపు రావడం వల్లే పలు సినిమాలు కూడా విడుదల అయ్యాయని జరిగిందని చెప్పక తప్పదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలివుడ్ లో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పేర్లలో కైకాల పేరు కూడా ఒకటని చెప్పక తప్పదు.
అక్కడ కయ్యం…
సినిమాల్లో యముని పాత్రలో నటించిన కైకాల గురించి పైలోకంలో పంచాయితీ మొదలైందట. నా పాత్ర పోషించిన ఆయన ఆత్మ తన లోకానికి రావాలని యముడు, లేదు లేదు నాలోకానికే తీసుకెల్తానంటూ స్వర్గాధిపతి ఇంద్రుడు వాదిస్తున్నారట. ఇద్దరూ భేటీ అయి కైకాలను తమ లోకానికి తీసుకెల్తామంటే తమ లోకానికి తీసుకెల్తామంటూ చర్చలు జరుపుతున్నారట. యముని పాత్రతో నా ఇమేజీ డ్యామేజీ చేశాడని యముడంటుంటే, లేదు లేదు నీ పాత్ర వల్ల పాపాలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించి సమాజాన్ని క్రమ శిక్షణలో పెట్టాడని ఇంద్రుడు వాదిస్తున్నారట. ఇరువురి మధ్య జరుగుతున్న చర్చలు రసకందాయకంలో పడి ఆయన హస్యంతో మానవాళిని సంతోషంలో కూడా ముంచెత్తాడని, లేదు లేదు విలన్ గా భయకంపితులను చేశాడని, అమాయక చక్రవర్తిగా వారి పక్షపాతిగా నటించాడని, కాదు కాదు అవును అవును అంటూ ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతున్న క్రమంలో నారదుడు ఎంట్రీ ఇచ్చి ఈ విషయాన్ని బ్రహ్మ చెవిలో వేశాడట. దీంతో వారిద్దరిని చతర్ముఖుడు పిలిపించుకుని ఇద్దరి వాదనలు విన్న తరువాత అప్పుడే ఎందుకు తొందర పడుతున్నారు..? మహా ప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు శనివారం జరుగుతాయని అప్పటి వరకూ వేచి చూడండని చెప్పాడంతో ఆ గొడవ అంతటితో సద్దు మణిగిందట.
వైవిద్యమైన పాత్రలకు జీవం పోసిన ఆ మహా నటుడి మరణంతో వెండితెర ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయింది. అయితే నటుడిగా ఆయన ఏ పాత్రలో అయినా తన విలక్షణత్వాన్ని అందించినందునే చరిత్రలో మిగిలిపోయారు. అటువంటి గొప్ప నటుడి మరణాన్ని జీర్ణించుకోలేక… ఆయనపై డిఫరెంట్ గా అందించిన అక్షర మాల….|