BIG BREAKING పల్లె నిద్రకు ఆటంకం

గ్రామస్థుల నిరసన

ప్రజలతో మమేకమై వారితో కలిసిపోయేందుకు ఆ ఎమ్మెల్యే తన పల్లెపల్లెకు వెల్తున్నారు. ప్రతి గ్రామంలో నిద్ర తీసి మరీ ఈ ఊరు సమస్యలు తెలుసుకోవడం, ఆ గ్రామానికి ఏం చేశారో వివరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మీరు నేను కార్యక్రమంలో భాగంగా ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆ గ్రామస్థులు భంగం కల్పించారు. అనూహ్యంగా పల్లె జనం చేపట్టిన నిరసనతో బీఆరెఎస్ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు.

కట్కాపూర్ మహిళల షాక్…

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్ పల్లెనిద్ర కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వెల్లారు. శనివారం రాత్రి ఎమ్మెల్యే గ్రామానికి వెల్తున్న క్రమంలో గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు, చిన్నారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మా గ్రామానికి ఎందుకు వస్తున్నారు సారూ..? రుణ మాఫీ చేయకుండా మోసం చేసినందుకు వస్తున్నారా..? క్వింటాలుకు ఐదు కిలోల తరుగు తీస్తున్నందుకు వస్తున్నారా..? 24 కరెంటు ఇస్తున్నామని చెప్పి ఎప్పుడు కోతలు విధిస్తారో తెలియని పరిస్థితికి ఏర్పడినందుకు వస్తున్నారా..? గ్రామంలో బీడీ కార్మికులందరికీ ఫించన్లు ఇవ్వనందుకు, 57 ఏళ్లు దాటిన వారికి ఫెన్షన్ ఇవ్వనందుకా లేక గ్రామంలో ఒక్కరికి డబుల్ బెడ్రూం కెటాయించనందుకు వస్తున్నారా అంటూ ఫ్లెక్సీల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తూ మహిళలు నిరసన చేపట్టారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామంతో పార్టీ నాయకులు అలెర్ట్ అయి వారిని ఆందోళన విరమింపజేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఓటు వేయమని వస్తున్నారు మేమెందుకు వేయాలో చెప్పాలని ప్రశ్నించారు. బీడీ కార్మికుల పెన్షన్లు అందరికీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.

You cannot copy content of this page