టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అదం,అభినయం నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏమాయ చేశావే సినిమాతో, ఎంతో మది ప్రేక్షకులను కూడగట్టుకున్న సమంత. తర్వాత అక్కినేని కోడలిగా వెళ్లి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంటను చూసి ఎంతో మంది కుళ్లుకునే వారు. అంత చూడముచ్చటగా ఉండేవారు. అలాంటి జంట ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, అటు అక్కినేని అభిమానులు, ఇటు సమంత అభిమానులు కోరుకున్నారు. కానీ పెళ్లై నాలుగు సంత్సరాలకే వీరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత వారి వారి కెరీర్‌పై ఫొకస్ చేశారు.
అయితే ఇటీవల ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సమంత, చైతూ విడిపోవడానికి కారణం, నాగచైతన్యనే, ఆయన టార్చర్ తట్టుకోలేక సమంత విడాకులిచ్చింది అంటూ సంచలన ట్వీట్ చేశాడు. కాగా దీనిపై అక్కినేని అభిమానులు మండిపడ్డారు.
కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో రూమర్ వైరల్ అవుతోంది. అదేమిటంటే, సమంత, చైతూ విడిపోవడానికి కారణం సమంతనేనంట. తనను అక్కినేని ఫ్యామిలీ పిల్లలను కనమంట, దానికి ఒప్పుకోలేదంట, అంతే కాకుండా ఎక్స్ పోజింగ్, బోల్డ్ కంటెట్ పాత్రల్లో నటించకు అని చెప్పినా వినేది కాదంట. ఈ విషయంలో అక్కినే ఫ్యామిలీ అంటే సమంతకు పడకపోయేది. ఈ విషయంలో నే చైతూకు, సమంతు మధ్య గొడవలు వచ్చాయంట. దీంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారని, నెట్టింట్లో మరో రూమర్ వైరల్‌గా మారింది. ఇక దీనిపై సమంత అభిమానులు మండిపడుతున్నారు. సామ్‌పై ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం సరికాదు అంటూ సోషల్ మీడియా వేధికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.