ఆలస్యంగా ప్రకటించారేంటి మేడం..?

మంత్రి సబితకు నెటిజన్ల ఝలక్

దిశ దశ, హైదరాబాద్:

ఏంటీ మేడం పిల్లలు ఉదయమే స్కూళ్లకు వెళ్లారు మీరు నెమ్మదిగా సెలవులు ప్రకటిస్తే ఎలా అంటూ నెటిజన్లు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే తమ పిల్లలను స్కూళ్లకు పంపించే వాళ్లం కాదని ఆలస్యంగా ట్విట్ చేయడం వల్ల పిల్లలను మళ్లీ ఇంటికి తీసుకొచ్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు రోజుల పాటు అన్ని పాఠాశాలలకు సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నెటిజన్లు మంత్రి సబిత లక్ష్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆలస్యంగా నిర్ణయాన్ని ప్రకటించడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, నిన్న రాత్రి ప్రకటించినా కనీసం గురువారం వేకువ జామున సెలవులని ప్రకటిస్తే బావుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఉదయం 7 గంటలకే తమ పిల్లలను సూళ్లకు పంపిచామని ఆలస్యంగా హలీడేస్ డిక్లేర్ చేయడం సరికాదంటూ కొందరు, బస్సుల్లో పిల్లలు స్కూళ్లకు బయలుదేరిన తరువాత 8.15 గంటలకు సెలవులు ఇచ్చామని చెప్పడం ఏంటని పేరెంట్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే తమ పిల్లలను ఇంటికే పరిమితం చేసే వారమని, ఆలస్యంగా డిక్లేర్ చేయడం వల్ల ఇతర పనుల్లో మునిగిపోవల్సిన తాము వాటిని పక్కన పెట్టి స్కూళ్లకు వెల్లాల్సిన పరిస్థితి ఏదురైందన్న ఆవేదనతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/SabithaindraTRS/status/1681858624619171841?t=GCLjrtMfXwgSozNlDk2wZw&s=19

You cannot copy content of this page