KTR ACB case: సుప్రీం కోర్టులోనూ చుక్కెదురే..!

దిశ దశ, జాతీయం:

ఫార్మూల ఈ కారు రేస్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను  సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఫార్మూల ఈ కార్ రేసు విషయంలో తలెంగాణ ఏసీబీ నమెదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హై కోర్టును ఆశ్రయించారు. అయితే క్వాష్ పిటిషన్ ను హై కోర్టు డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆయన పిటిషన్ ను విచారించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో KTR పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టింది.

తప్పదిక..?

తాజాగా సుప్రీం కోర్టు కూడా తెలంగాణ ఏసీబీ నమెదు చేసిన కేసు విషయంలో వేసిన క్వాష్ పిటిషన్ ను తిరస్కరించడంతో ACB, EDల ముందు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. లొట్టపీసు కేసంటు వ్యాఖ్యానించిన కేటీఆర్ కేసును కొట్టివేయాలని రాష్ట్ర, దేశ సర్వోన్నత న్యాయ స్థానాలను ఆశ్రయించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో ఈ కేసు విచారణ ఎదుర్కొక తప్పని పరిస్థితి తయారైంది కేటీఆర్ కు. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు ఓ సారి విచారించగా మరోసారి విచారణకు పిలుస్తామని వెల్లడించారు. ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో  ఏసీబీ తన అస్త్రాలకు పదును పెట్టనుంది. క్యాబినెట్ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేసిన విషయంపై ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మరో వైపున రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. మొదటి సారి నోటీసులు ఇచ్చినప్పుడు తాను వేసిన క్వాష్ పిటిషన్ పై  హై కోర్టులో విచారణ ఉన్నందున రాలేకపోతున్నానని కేటీఆర్ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు రావాలని మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. బుధవారం సుప్రీంకోర్టులో తన క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ లాభం లేకుండా పోయింది. సుప్రీం కోర్టు ధర్మాసనం కూడా తిరస్కరించడంతో రేపటి ఈడీ విచారణకు హాజరు కాక తప్పదని తెలుస్తోంది. అయితే రిజర్వూ బ్యాంకు అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వంలోని క్రీడల విభాగం పర్మిషన్ లేకుండా నిధులను విదేశి కంపెనీకి ఎలా పంపించారన్న విషయంపై ఈడీ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. దీంతో కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణకు హాజరు కావల్సిందేనని స్పష్టం అవుతోంది. 

You cannot copy content of this page