నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

నవ్వడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. కొంత మంది అంటుంటారు నవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఇట్టే తీరిపోతాయని, అంతే కాకుండా మనిషి శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవని. అలాగే ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండే వ్యక్తికి కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలూ దరిచేరవని, అందువలన నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే నవ్వడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. నవ్వడం వలన గుండె సమస్యలు దరి చేరవు. నవ్వుతూ ఊపిరి పీల్చుకోవడం ద్వారా రక్తంలో ఆక్సిజన్ ఏర్పడి, రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంటుంది. అలాగే ఎక్కువగా నవ్వే వారికి రక్తపోటు సమస్య ఉండదు. అంతే కాకుండా నవ్వు బీటా-ఎండార్ఫిన్లు మరియు ఇతర హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి టి-కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీని కారణంగా, లింఫోసైట్లు ఏర్పడతాయి తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నవ్వడం ఒక ‘భోగం’ నవ్వించడం ఒక ‘యోగం’ నవ్వలేకపోవడం ఒక ‘రోగం’ అని భారతీయులు అందుకే అంటుంటారు.

You cannot copy content of this page