మహేష్ బాబుకు.. నమ్రత అంటే ఎంత ప్రేమో ..ఈ పోస్టులో తెలుస్తుంది !

తెలుగు సినీ పరిశ్రమలో సెలబ్రిటీ కపుల్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జోడికి ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్ . అన్ని విషయాల్లో మహేష్‌కు బ్యాక్ సపోర్ట్‌గా నమ్రత ఉంటుంది. ఇక మహేష్ బాబు కూడా తన కుటుంబం పట్ల ఎంత ఎఫెక్షనేట్‌గా ఉంటాడో మనకి తెలిసిందే. నిజం చెప్పాలంటే మహేష్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పొచ్చు. ఖాళీ సమయం దొరికితే చాలు పిల్లలతో కలిసి టైమ్ స్పెండ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇక ఏదైనా స్పెషల్ డేస్‌ సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ బాబు విషెస్ చెబుతుంటారు.
తాజాగా తన సతీమణి నమ్రతకు పుట్టిన రోజు విషెస్ తెలిపాడు.

నేడు నమ్రత ఆమె 51వ పుట్టినరోజు జరుపుకుంటుండగా.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. ‘హ్యాపీ బర్త్‌డే NSG! అన్ని విషయాలల్లో నాకు సపోర్ట్ చేస్తూ..అన్ని దృష్టిలో ఉంచుకున్నందుకు.. అలాగే నువ్వు నీలాగే ఉంటూ నాకు లిఫ్ట్ ఇస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు!’ అంటూ ఈ పుట్టినరోజుకు మహేష్ బాబు కొత్తగా విషెస్ తెలుపుతూ నమ్రత హ్యాపీగా ఉన్న ఫోటోను షేర్ చేశాడు.

మహేష్ బాబు సినిమాల గురించి మాట్లాడుకుంటే అతను ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 మూవీతో చాలా బిజీగా ఉన్నారు. యీ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్నుగా నటిస్తుంది. యంగ్ హీరోయిన్ శ్రీలీలాను కూడా ఫైనల్ చేసి నట్లు తెలుస్తోంది. S S తమన్ స్వరాలను అందిస్తున్నారు. సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ ఐపోయిన తర్వాత మహేష్.. SS రాజమౌళితో కలిసి ఒక సినిమా చేయనున్నారని మనకి తెలిసిన విషయమే. ఈ సినిమా మొత్తం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ సినిమాగా మన ముందుకు వస్తుందట.

You cannot copy content of this page