జొమోటో సంస్థకు ఇన్ని కోట్లు నష్టం వచ్చాయా ?

జొమాటో సంస్థలో దాదాపు పదేళ్లకుపైగా పని చేసిన జొమాటో కో ఫౌండర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పాటిదార్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గుంజన్ గురించి జొమోటో అతని గురించి కొన్ని మాటలు వెల్లడించింది. ఇంత ఎత్తు ఎదిగిందంటే ..దానిలో గుంజన్ పాత్ర ఉందని, ఆయన సేవలు జొమోటో ఎప్పటికి మర్చిపోదని తెలిపింది. చిన్న కంపెనీగా మొదలయ్యి ఇప్పుడు కోట్ల బిజినెస్ చేస్తుంది. దీనిలో గుంజన్ పాత్ర కీలకమైనది. 2022 నవంబర్ నెలలోనే అప్పటి జొమాటో కో- ఫౌండర్ మోహిత్ గుప్తా తప్పుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. అతను నాలుగున్నరేళ్లు పనిచేసి జొమాటో నుండి వైదొలగారు. ఆ తర్వాత ఇప్పుడు మరో కో ఫౌండర్, సీటీఓ కూడా తప్పుకోవడంతో జొమాటోకు మరింత పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఇటీవల 2022 సెప్టెంబర్‌తో జొమాటో కంపెనీకి నష్టాలొచ్చాయి. మొత్తం రూ.250.8 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించింది. 2021, 2020 తో పోలిస్తే ఏకంగా రూ. 434.9 కోట్లు నష్టపోయింది. అయితే రెవెన్యూ మాత్రం పెరిగింది. ఆపరేషన్స్ రెవెన్యూ 62.20 శాతం పెరిగి రూ.1661.30 కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించింది. అలాగే జొమోటో సేల్స్ 22 శాతం పెరిగాయని తెలిపింది.

You cannot copy content of this page