దిశ దశ, జాతీయం:
అయోధ్య రాముని కోసం కృష్ణుడు కూడా ఉపయోగపడ్డాడు. అయోధ్యలో పునర్నిమాణం జరుగుతున్న ఆలయంలో ఎంపిక చేసిన విగ్రహాల కోసం ‘కృష్ణ శిల’ (black stone)తో విగ్రహాలను తీర్చిదిద్దారు. కర్ణాటకలోని మైసూర్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఆలయ ట్రస్ట్ ఎంపిక చేసింది. దక్షిణాదికి చెందిన కృష్ణ శిలపై చెక్కిన ఈ విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో శిల్పికి కూడా అరుదైన గౌరవం దక్కినట్టయింది.
వెయ్యేళ్ల వరకు…
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణానికి వెయ్యేళ్ల వరకు మరమ్మత్తులు వచ్చే అవకాశం లేకుండా పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణంలో ఉక్కు కానీ, ఇనుము కానీ వాడడం లేదిన నిర్వాహకులు వివరించారు. ఆలయ పునాదిని 50 అడుగుల లోతు నుండి తీశామని, దీని నిర్మాణంలో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 13 కోట్ల మంది భాగస్వాములు అయినట్టు కూడా వివరించారు. 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా ఆలయ పునాదిని కదిలించే అవకాశం లేదని, భూ ప్రకంపనలు తట్టుకునేలా బలమైన నిర్మాణం చేపట్టామని ఎల్ అండ్ టి ప్రాజెక్టు డైరక్టర్ వినోద్ కుమార్ మెహతా తెలిపారు.