ముకేష్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే

దేశంలోనే నెంబర్ వన్ అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే.. అందరూ చెప్పే పేరు ముకేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ఉన్న ఆయన.. ఎన్నో వ్యాపారాలు చేస్తోన్నారు. ప్రతి వ్యాపారంలోనూ ఆయన అడుగుపెట్టి రాణిస్తున్నారు. ముకేష్ అంబానీ ఏ రంగంలోకి అడుగుపెడితే.. ఆ రంగంలో రాణిస్తున్నారు. దానికి కారణం ఆయన బిజినెస్ స్ట్రాటజీలు సక్సెస్ కావడమే కారణం. టెలికాం రంగంలో జియో ఎంట్రీతో నూతన మార్పులు వచ్చాయి.

జియో దెబ్బకు డేటా ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఇక షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, జూయలర్స్ ఇలా ప్రతి రంగంలోనూ రిలయన్స్ అడుగుపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో టాప్ టెన్ లో ముకేష్ అంబానీ ఉంటున్నారు. మరి అలాంటి ముకేష్ అంబానీ డ్రైవర్ జీతం ఎంత ఉంటుందో తెలుసా.. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్ వేరే ఇంజినీర్ కన్నా ముకేష్ అంబానీ డ్రైవర్ జీతం లక్షల్లో ఉంటుందట.

అంబానీకి ఓ ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ డ్రైవర్లను నియమిస్తోంది. 2017లో ముకేష్ అంబానీ డ్రైవర్ జీతం రూ.2 లక్షలు ఉండగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. ముకేష్ అంబానీ బడా వ్యాపారవేత్త కావడంతో ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ ఉంటుంది. దీంతో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లను నియమిస్తారు. అలాగే అలవెన్సులు, ఇతర బీమాలు కూడా డ్రైవర్‌కు అందుతాయి.

ఇక కుక్లు గార్డు, హౌస్ కీపింగ్ సిబ్బందికి కూడా వేలల్లో జీతం ఉంటుంది. అలాగే వారికి ఇతర అలవెన్సులు, ఇన్సూరెన్స్ బీమాలు కూడా అందుతాయట. తాజాగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక సల్మాన్ ఖాన్ దగ్గర పనిచేసే బాడీగార్డ్ షారా జీతం సంవత్సరానకి రూ.2 కోట్లు కగా.. కరీనా కపూర్ బాడీ గార్డ్‌కు నెలకు రూ.1.50 లక్షలుగా ఉంది. ఇక అమితాబచ్చన్ బాడీ గార్డ్ కు సంవత్సరానికి రూ.1.5 కోట్ల జీతం ఉంటుంది.

You cannot copy content of this page