అక్కడ వాటితోనే సహవాసం… చేయక తప్పని ధైన్యం…

షాకింగ్ వీడియో వైరల్…

దిశ దశ, జాతీయం:

దోపిడీ దొంగల తమ ఇండ్లలోకి ఎప్పుడు చొరబడతారోనన్న భయంతోనే అక్కడి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. దొంగల ముఠాలు తమ ఇండ్లలోకి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దోచుకెల్తుంటారు. దీంతో వారు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. దొంగల నుండి తప్పించుకునేందుకు వారు ప్రయత్నించకుండా గ్యాంగులనే భయపెట్టేందుకు సాహసిస్తున్నారు. ఇందు కోసం వారు తమ సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్న ఆయుధాలను చూస్తే ఒళ్లు జలధరించక మానదు. చంబల్ లోయా వంటి ప్రాంతాలకు చెందిన ముఠాలు రాబరీలకు పుల్ స్టాప్ పెట్టినా… ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దోపిడీలు కొనసాగుతున్నాయన్న విషయం కూడా తేటతెల్లం అయింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోనే ఇందుకు ప్రధాన సాక్ష్యంగా చెప్పవచ్చు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ కూడా భయానక పరిస్థితులే నెలకొన్నాయి. తమను తాము రక్షించుకునేందుకు అక్రమంగా ఆయుధాలు వినియోగించక తప్పడం లేదని అక్కడి ప్రజలను గమనిస్తే స్పష్టం అవుతోంది. రాష్ట్రంలోని మొరెనా జిల్లాలోని మహువా పోలీస్ స్టేషన్ పరిధిలో గల గణేష్ పురా గ్రామానికి చెందినట్టుగా ప్రచారం జరుగుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన ఇంటి ఆవరణలో ఆయుధాలను క్లీన్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కంట్రీమేడ్ తుపాకులు నాలిగింటిని ఓ పాత్రలో పెట్టి శుభ్రం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తీసిన వారు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా ఆ ప్రాంతంలో దోపిడీ దొంగల బీభత్సం తీవ్రంగా ఉంటుందని, ఏ సమయంలో ముఠాలు తమ ఇండ్లలోకి చొరబడతాయోనన్న ఆందోళనతోనే అక్కడి జనం జీవనం సాగిస్తుంటారని తెలుస్తోంది. ఈ కారణంగా తమను తాము కాపాడుకోవాలంటే దొంగలను భయపెట్టేందుకు స్థానికంగా అందుబాటులో ఉన్న కంట్రీ మేడ్ (country made guns) తుపాకులను కొనుగోలు చేసుకుని ఆత్మరక్షణ చర్యలకు తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న ఆయుధాలు (Weapons) తుప్పు పట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకుంటారని తెలుస్తోంది. గణేష్ పురా గ్రామానికి చెందిన ఓ మహిళ కంట్రీమేడ్ తుపాకులను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. కంట్రీమేడ్ తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది.

బ్యారల్ ఎలా మరి..?

అయితే మహిళ ఆయుధాలను తళతళ మెరిసే విధంగా సబ్బు పెట్టి, బ్రష్ తో శుభ్రం చేస్తున్నారు కానీ ఫైర్ చేసినప్పుడు తూటాలు బయటకు వచ్చే బ్యారెల్ (Weapon barrel) క్లీన్ గా లేకుంటే దోపిడీ దొంగలపై ప్రయోగించినా ఫలితం ఉండదు. బ్యారెల్ ను పుల్ తుర్ విధానంతో శుభ్రం చేస్తే లోపల ఏర్పడిన తుప్పు అంతా క్లీన్ అవుతుంది. కానీ పై ప్రాంతాన్ని శుభ్రం చేయడం వల్ల వెపన ఉందన్న సంకేతాలు పంపించవచ్చు కానీ తుటాలు బయటకు రావన్న విషయం తెలిస్తే దోపిడీ దొంగలు మరింత రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా నాటు తుపాకులే అయినా… ఆధునిక తుపాకులే అయినా ఇలా నీటిలో శుభ్రం చేస్తే మరింత తొందరగా తుప్పు పట్టే ప్రమాదం కూడా లేకపో్లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఆ ప్రాంతంలో దోపిడీ దొంగల భయం ఏ స్థాయిలో ఉందో మహిళ నిర్భయంగా ఆయుధాలను క్లీన్ చేస్తున్న (Weapons cleaning) తీరు మాత్రం అద్దం పడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు (Netizens) మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page