ఘరనా దొంగతనం చేసి తప్పించుకోవడం కామన్… కానీ దొంగను గుర్తించినా కేసు పెట్టలేని పరిస్థితి తయారైందక్కడ. వినడానికి వింతగానే ఉన్నా చూస్తే మీరూ ఔరా అనక మానరు. ఇంతకీ ఎవరా దొంగ ఏం జరిగిందక్కడ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదివి… కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి… సీసీ ఫుటేజీ దృశ్యాలను మీరూ చూడొచ్చు.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడిప్పుడే చర్చనీయాంశంగా మారుతోంది. ఓ జ్యుయలరీ షాపులో జరిగిన ఈ దొంగతనానికి సంబందించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను కనుగొన్నారు కూడా. జ్యుయలరీ షాపులో రూ. లక్షల విలువ చేసే నగ ఒకటి అదృశ్యం అయింది. దీంతో షాపు యజమానకి అత్యంత విలువైన నగ ఎలా చోరీకి గురయిందని మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ఉద్యోగులను సైతం ఆరా తీసి వారు దొంగతనానికి పాల్పడలేదని నిర్దారించుకున్నారు. క్లోజ్ డ్ సర్క్యూట్ కెమెరా (సీసీ) ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలుసుకున్న ఆ యజమాని డీవీఆర్ బాక్సులో రికార్డయిన దృశ్యాలు చూసి అవక్కాయ్యారు. ఇంతకీ ఆ దొంగనతం చేసిందెవరో తెలుసా..? ఓ ఎలుక. ఇంతకీ ఆ ఎలుక ఎలా నగను ఎత్తుకెళ్లింది అన్న వీడియో చూడాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి…. https://youtu.be/aKocg0z_VME
Disha Dasha
1884 posts
Next Post