ప్రమాదాలతో సహవాసం అవసరామా..? రీల్స్ చేసిన యువకుడికి సజ్జనార్ కౌన్సెలింగ్

దిశ దశ, హైదరాబాద్:

క్రియేటివిటీకి పదును పెట్టి తమ గొప్పతనాన్ని చాటుకోవల్సిన యువత ఇప్పుడు రీల్స్ మోజులో పడిపోయింది. ప్రమాదాలతో సహవాసం చేసే విధంగా యువత వ్యవహరిస్తున్న తీరుతో ఆందోళన మొదలైంది. ఇలాంటి వింత పోకడలతో లైకులు, షేర్స్ కు అడిక్ట్ అయిన యువత తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా నియంత్రించే వారు లేకుండా పోయారు. మృత్యువు అంచుల్లో చేస్తున్న ఈ ఫిట్లకు… అన్ ఫిట్ అన్న విషయాన్ని విస్మరిస్తున్న నేటితరం తీరుపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తాజాగా ఓ యువకుడు ఆర్టీసీ బస్సుతో చేసిన రీల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసిన తరువాత తమ క్రేజీ ఎంత ఉందో చూసుకుంటు సంబరిపడిపోతున్న తీరు ఆశ్యర్యకరంగా మారింది. ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేసిన వారిని సాహసం అంటారు కానీ సోషల్ మీడియాలో క్రేజీ చేస్తున్న సర్కస్ ఫిట్లు చూసి కాదన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నూనుగు మీసాల యువకుడు రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనక పరిగెత్తుతూ వెనక వైపు నుండి పైకి ఎక్కి పైన చేసిన రీల్స్ చివరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వి సి సజ్జనార్ వరకు చేరాయి. దీంతో ఆయన రీల్స్ చేసిన యువకుడి ఆచూకి దొరకబట్టుకుని పిలిపించుకుని కౌన్సెలింగ్ చేశారు. ప్రమాదకరంగా వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ హితవు పలికారు. ప్రయాణీకులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై ఇలా రీల్స్ చేయడం మంచిది కాదని వివరించారు. ఇలాంటి వ్యవహరాలకు మళ్లీ పాల్పడితే బావుండదని కూడా స్ఫష్టం చేశారు. అనంతరం సదరు యువకుడి వాంగ్మూలన్ని వీడియో రికార్డు చేసి ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇలాంటి డేంజరస్ ఫిట్లు చేయకండంటూ ఆర్టీసీ ఎండీ రీల్స్ మోజులో ఉన్న వారికి హితవు పలికారు.

You cannot copy content of this page