రోడ్డు మీదుగా వెళ్లండి… కేజీ వీల్స్ తో మాత్రం కాదండి

జగిత్యాల జిల్లాలో రైతు వినూత్న ప్లెక్సీ…

దిశ దశ, జగిత్యాల:

నా సొంత ఖర్చులతో వేసుకున్న రోడ్డు ఇది… ఈ రోడ్డు మీదుగా కేజీవీల్స్ తో మాత్రం తిరగకండి అంటూ ఓ రైతు వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వర్శకొండ శివార్లలో కంతి రమేష్ అనే యువకుడు పౌల్ట్రిఫాం ఏర్పాటు చేసుకున్నాడు. గుడ్లను తరలించేందుకు రహదారి బాగా లేకపోవడంతో గుడ్లు తరుచూ పగిలిపోతున్నాయని తన సొంత ఖర్చులతో రోడ్డును బాగు చేయించుకున్నాడు. వర్షా కాలం వచ్చిందంటే చాలు ఆ రోడ్డు మీదుగా స్థానికులు కేజీ వీల్స్ వేసుకుని ట్రాక్టర్లను నడిపిస్తుండడంతో రోడ్డు పూర్తిగా దెబ్బ తింటోంది. దీంతో రోడ్డును తరుచూ రిపేరు చేయించాల్సి వస్తోందని, దీనివల్ల చేతి చమురు వదిలించుకోవల్సి వస్తోందని ఆవేదన చెందిన సదరు రైతు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. సొంతగా రూ. 25 వేలు వెచ్చించి రోడ్డున బాగు చేయించినందున ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించండి కానీ కేజీవీల్స్ వాహనాలతో మాత్రం వద్దని కోరుతూ ఫ్లెక్సీలో ముద్రించారు. డిఫరెంట్ గా ఉన్న ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You cannot copy content of this page