ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే… చిన్న స్థాయి నుండి వచ్చిన అందలం ఎక్కే అవకాశం ఉంటుందనడానికి ఇటీవల కాలంలో కీలక పదవుల్లో ఆసీనులవుతున్నవారే ఉదాహారణ. నిర్థయించుకున్న లక్ష్యాన్ని ఛేదించుకుందుకు అవసరమైన కార్య దీక్ష అనేది ముందుంటే ఖచ్చితంగా ఏ స్థాయికైనా చేరుకోవచ్చని నిరూపిస్తున్నారు. దేశ రాజకీయాల్లో మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకున్న కమలనాథులకు తోడుగా కాంగ్రెస్ పార్టీ కూడా జత కలిసింది. ఛాయ్ వాలా ప్రధాని అని బీజేపీ చెప్పుకుంటే… దూద్ వాలా సీఎం అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోనుంది.
సీఎం సుక్కు…
తాజాగా ఎన్నికైన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు నేపథ్యవ తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. సాదారణ కుటంబం నుండి వచ్చిన సుక్కు ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన ఆయన పాలనదక్షుడిగా ఎదగడానికి ముందు పాలు అమ్ముకుంటూ జీవనం సాగించారు. ఛోటా సిమ్లా ఏరియాలో పాల విక్రయకేంద్రాన్ని నడిపించిన సుక్కు నేడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తండ్రి ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ లో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఉన్నత చదువులు చదివిన సుక్కు ఐదు సార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన ఇప్పుడు సీఎంగా ఎన్నికయ్యారు.
క్రెడిట్ కొట్టిసిన కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీలో సామాన్యులకు ఛాన్స్ ఉండదని అది తమ పార్టీలో మాత్రమే సాధ్యమని బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అసామన్యులకే ఉన్నత శిఖరాలు అధిరోహించే పరిస్థితి ఉంటుందని, బీజేపీలో అలా కాదని పార్టీలో క్రీయశీలకంగా పనిచేసే సామన్య కార్యకర్తకు కూడా సముచిత న్యాయం లభిస్తుందని కమలనాథులు చెప్తుంటారు. అయితే ఇక నుండి కాంగ్రెస్ పార్టీ కూడా తాము కూడా దూద్ వాలాను సీఎంగా చేశామని, సామాన్యులు ఉన్నత శిఖరాలు అందుకునే పరిస్థితి ఉంటుందని చేతల్లో చూపించింది. ఏది ఏమైనా రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి విషయాల్లో పోటీ వాతావరణం నెలకొంటే సామాన్యులు కూడా ముఖ్య భూమిక పోషించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.