ఇటు నుండి ఎగువకు… అటు నుండి దిగువకు…

ఉమ్మడి జిల్లాలో జలకళ

దిశ దశ, కరీంనగర్:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ నది నుండి నీరు దిగువకు ప్రవహిస్తుంటే... మరో నది నుండి ఎగువ ప్రాంతానికి తరలిపోతోంది. ఏక కాలంలో ఉమ్మడి జిల్లాలో నీటి సరఫరా విచిత్రంగా ప్రవహిస్తుండడంతో అరుదైన రికార్డు నెలకొల్పినట్టయింది.

ఎల్లంపల్లి నుండి…

పెద్దపల్లి రామగుండం సమీపంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. అధికారులు. ఓ వైపున శ్రీరాం సాగర్, మరో వైపున కడెం ప్రాజెక్టుల నుండి వరద నీరు వస్తుండడంతో శుక్రవారం మద్యాహ్నం ఇరిగేషన్ అధికారులు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మద్యాహ్యం ఒంటి గంట ప్రాంతంలో 10 గేట్లను ఎత్తిన అధికారులు 51 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలగా వరద ఉధృతి మరింత తీవ్రంగా ఉన్నట్టయితే మరిన్ని గేట్లను ఎత్తి ఎక్కువ నీటిన వదిలేందుకు కూడా సమాయత్తం అయ్యారు ఇరిగేషన్ అధికారులు. మరో వైపున మంథని సమీపంలోని సుందిళ్ల బ్యారేజ్ నుండి 60 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇకపోతే భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజ్ నుండి 47,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. మహారాష్ట్రలోని ప్రాణహిత మీదుగా వరద నీరు పోటెత్తడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుండి కంటిన్యూగా వరద నీటిని వదులుతున్నారు అధికారులు. శుక్రవారం మద్యాహ్నం 65 గేట్ల ద్వారా 4,71,310 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన ప్రతి ఆనకట్ట నుండి కూడా దిగువ ప్రాంతాలకు నీరు వెళ్లిపోతోంది.

మానేర్ టు…

కాళే్శ్వరం నీటిని తనలో నిలువ చేసుకుని ఉన్న కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంపు హౌజ్ నుండి ఇప్పటికే ఎల్లంపల్లికి నీటిని తరలించారు అధికారులు. మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి కూడా వరద వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన అధికారులు మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యాంకు నీటిని విడుదల చేశారు. శుక్రవారం మద్యాహ్నం వరకు ఆరు గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని ఎగువకు పంపిస్తున్నారు. మానేరు ఎగువ ప్రాంతం నుండి కూడా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన అధికారులు శుక్రవారం నుండి లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌజ్ నుండి నీటిని పంపించే ప్రక్రియకు తాత్కాలికంగా నిలిపివేశారు. మరో వైపున రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని అనంతగిరి నుండి రంగనాయక్ సాగర్ కు కూడా నీటిని తరలిస్తున్నారు. అయితే గోదావరినదిలో నీరు దిగువకు వెల్లిపోతుంటే మానేరులో మాత్రం జలాలు ఎగువ ప్రాంతాలకు తరలిపోతుండడం గమనార్హం.

You cannot copy content of this page