ఏపీ డిప్యూటీ సీఎంకు సిరిసిల్ల నేతన్న దుస్తులు…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా డ్రెస్ మెటిరియల్ తయరయింది. సిరిసిల్ల నేతన్న దంపతుల తయరు చేసిన ఈ మెటిరియల్ అమెరికాకు చెందిన పవర్ స్టార్ అభిమాని ఆర్డర్ చేశారు. 25 రోజుల పాటు శ్రమించి తయారు చేసిన ఈ క్లాత్ ను అభిమానికి పంపించే పనిలో నిమగ్నం అయ్యారు.

వైవిద్యమైన కళ…

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సిరిసిల్ల నేతన్నలు వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తరతరాలుగా కొనసాగిస్తున్న నేత పనిలోనే తమలోని కళాత్మకతకు పదును పెడుతున్న కార్మికులకు ఆర్డర్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడితో పాటు పలువురు ప్రముఖులకు తమ చేతిలో రూపుదిద్దుకున్న బుల్లి మరమగ్గాలను, వినూత్నంగా నేసిన దుస్తునుల పంపించిన వెల్ది హరిప్రసాద్ చేతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా డ్రెస్ మెటిరియల్ తయారైంది. అమెరికాకు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆర్డర్ ఇవ్వడంతో 25 రోజుల పాటు శ్రమించి హరిప్రసాద్ దంపతులు వాటిని సిద్దం చేశారు. రూ. 5 లక్షల వరకు ఇందు కోసం అమెరికాకు చెందిన అభిమాని డబ్బులు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. పవణ్ కళ్యాణ్ వేసుకునే డ్రెస్ క్లాత్ ను నేసే బాధ్యత తీసుకున్న హరి ప్రసాద్ దంపతులు సిద్దం చేశారు.

స్పెషాలిటీ ఇదే…

హరిప్రసాద్ ఇటీవలే ఏపీ డీప్యూటీ సీఎం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జ్ఞాపికను పంపించారు. దానిని చూసిన అమెరికా అభిమాని పవర్ స్టార్ వేసుకునేందుకు ప్రత్యేకంగా డ్రెస్ మెటిరియల్ నేసి పంపించాలని కోరారు. డ్రైస్ పై జనసేన లోగో వచ్చే విధంగాద డిజైన్ చేసి నేసి ఈ మెటిరియల్ సిద్దం చేశాడు. లోగోను తయారు చేసేందుకే ఐదు రోజుల సమయం పట్టిందంటే ఆ కళాకారుడు ఇందుకోసం ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవచ్చు. లోగో కోసం వాడిన మెటిరియల్ మాత్రం సిల్క్ అని మిగతా అంతా కామాన్ దారాలతో తయారు చేశామని వెల్ది హరిప్రసాద్ వివరించారు. ఇందు కోసం వార్పు కాటన్ 100 నంబర్ లడీలను వినియోగించడంతో పాటు 100Lee లెనిన్ ఉపయోగించామని తెలిపారు. షర్ట్ తయారు చేసేందుకు పదిహేను రోజుల పాటు శ్రమించాన్నారు. ఇంతకాలం సాధారణ క్లాత్ తయారు చేసిన హరిప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఇచ్చిన ఆర్డర్ ను లెనిన్ కాటన్ తో సిద్దం చేశారు. తొలిసారి లెనిన్ కాటన్ క్లాత్ తన చేతిలో రూపుదిద్దకుందని తెలిపాడు.

You cannot copy content of this page