పన్ను ఎగవేత విషయంలో సామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ (ఎస్‌ఐఈఎల్)కు డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమారు రూ. 1,728.47 కోట్ల విలువైన దిగుమతి పన్నులను సామ్‌సంగ్ ఇండియా ఎగవేసిందని డిఆర్‌ఐ ఆరోపించింది. వడ్డీతో పాటు డబ్బును ఎందుకు రికవరీ చేయకూడదని కూడా ఏజెన్సీ సామ్‌సంగ్‌ను కోరింది. అలాగే, కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్‌పై పెనాల్టీ ఎందుకు విధించకూడదని కూడా ఏజెన్సీ నోటీసులో కోరినట్లు సమాచారం.
ఇంకా డిఆర్‌ఐ, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పిడబ్ల్యుసి), అసోసియేట్ డైరెక్టర్‌కు కూడా షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసు పై శామ్‌సంగ్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ పన్ను వివాదాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే, దీనిపై మరింత న్యాయపరమైన అభిప్రాయాన్ని అన్వేషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఎస్‌ఐఈఎల్(SIEL), పిడబ్ల్యుసి(PWC) రెండింటికీ 30 రోజుల సమయం ఇచ్చినట్లు సమాచారం.