ట్రేస్ చేసిన యాంటీ నార్కోటిక్ బ్యూరో
దిశ దశ, ఖమ్మం:
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూర్ (TGANB) సరి కొత్త తరహాలో సాగుతున్న డ్రగ్స్ రవాణాను ట్రేస్ చేసింది. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ డెలివరీ ఆపరేషన్ ను అడ్డుకోవడంలో సక్సెస్ అయింది. సాంకేతికతను అందిపుచ్చుకుని స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ డెలివరీ కోసం ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ను ఉపయోగిస్తున్నట్టు నెట్ వర్క్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. TGANB టెక్నికల్ వింగ్ అందించిన సమాచారం మేరకు RNCC ఖమ్మం జిల్లా అధికారులు, టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి ఓ పట్టణానికి చెందిన ఓ ఇంజనీర్ ను అరెస్ట్ చేశారు. గత జులై 31న డార్క్ వెబ్ లో డ్రగ్స్ ఆర్డర్ చేసి క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు బదిలీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. విక్రేత స్పీడ్ పోస్ట్ ద్వారా అస్పాంలోని సిల్సుఖరి నుండి డ్రగ్స్ పంపించిన వ్యక్తి సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ట్రాకింగ్ నంబర్ చేరవేశాడు. RNCC అధికారులు పార్శిల్ కొనుగోలుదారునికి అందిస్తుండగా పట్టుకున్నారు. ఆగస్టు 8న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన అధికారులు అతనితో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వార్తా పత్రికల్లో బ్రౌన్ టేప్ కింద డ్రగ్స్ ఉంచి స్పీడ్ పోస్టు ద్వారా పంపించినట్టుగా అధికారులు గుర్తించారు.