దిశ దశ, హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో మరో సారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. జన్వాడ ఫాంహౌజ్ లో రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం అందుకున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (SOT) బృందాలు దాడులు నిర్వహించాయి. డీజే సౌండ్స్ హంగామా నడుమ సాగుతున్న రేవ్ పార్టీపై దాడి చేసినప్పుడు భారీగా విదేశి మద్యం, డ్రగ్స్ లభ్యం అయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పార్టీకి హాజరైన వారికి పోలీసులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొంతమందికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్టుగా ప్రాథమిక సమాచారం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫాం హౌజ్ గా పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
క్రిమినల్ కేసులు…
జన్వాడ ఫాంహౌజ్ లో ఎస్ఓటీ పోలీసులు, ఎక్సైజ్ అదికారులు జాగిలాలతో దాడులు నిర్వహించారు. అందులో 21 మంది పురుషఉలు, 14 మంది మహిళలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. 10.5 లీటర్లు ఉన్న 7 విదేశి మద్యం బాటిళ్లు, 10 ఇండియన్ మేడ్ లిక్కర్ బాటిళ్లను గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో ఒకరికి కొకైన్ పాజిటివ్ అని నిర్దారించిన అధికారులు ఆమనను హస్పిటల్ కు పంపించి బ్లడ్ షాంపిల్స్ సేకరించారు. అతనిపై 27 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ లో మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరోవైపున ఈ రేవ్ పార్టీని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నిర్వహించారని, ఎక్సైజ్ లైసెన్స్ లేకుండానే మద్యాన్ని విక్రయించారని, 34ఏ, (1), రెడ్ విత్ 9 ఆఫ్ ఎక్సైజ్ యాక్టులో రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియరావల్సి ఉంది.