ఫేస్ బుక్ పరిచయంతో కలిసి జీవనం సాగిస్తున్న ఒకరు శవంగా మారి తునా తునకలై పోగా… మరోకరు కటకటాలు లెక్కిస్తున్నారు. కలిసి జీవనం సాగిస్తున్నాం కదా పెళ్లి చేసుకో అన్న పాపానికి ఓ శాడిస్ట్ నేరం చేసిన తీరు ఒళ్లు జలధరించేలా ఉంది. సాక్షాత్తు దేశ రాజధాని న్యూ డిల్లీలో జరిగిన ఈ ఘటన పూర్వా పరాలిలా ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రేయసిని 35 ముక్కలుగా చేసి తప్పించుకుని తిరుగుతున్న ప్రియుడి భండారాన్ని బయటపెట్టారు ఢిల్లీ పోలీసులు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో లోతుగా దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీసులు విస్తుపోయే నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
అసలు కథ ఇది…
ముంబైకి చెందిన అప్తాబ్, శ్రద్దలకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ ఏఢాది ఆరంభంలో ముంబై నుండి ఢిల్లీకి మకాం మార్చిన వీరిద్దరూ కలసి ఒకే ఫ్లాట్ లో ఉంటున్నారు. కొన్ని నెలల తరువాత శ్రద్ద పెళ్లి చేసుకుందామని అప్తాబ్ తో ప్రపోజ్ చేయడంతో ఇరువురి మధ్య మనస్పర్దలు పొడసూపాయి. ఈ క్రమంలో శ్రద్ద పెళ్లి చేసుకునే విషయంలో ఒత్తిడి తీవ్రతరం చేయడంతో అప్తాబ్ క్రిమినల్ గా మారిపోయాడు.
18:18
ఈ క్రమంలో మే 18న ఇద్దరి మధ్య పెళ్లి గురించి గొడవ మరింత సీరియస్ గా సాగి ఘర్ణకు దారి తీసింది. దీంతో శ్రద్దను అంతం చేయాలని భావించిన అప్తాబ్ ఆమెను హత్య చేశాడు. ఆమె మృత దేహం దొరికితే చట్టానికి దొరికిపోతానని భావించిన అప్తాబ్ 300 లీటర్ల ఫ్రిడ్జ్ ను కొనుగోలు చేసి శ్రద్ద శవాన్ని ఏకంగా 35 ముక్కలు చేసి అందులో ఉంచాడు. 18 రోజుల పాటు ప్రతి రోజూ అర్థరాత్రి వేళల్లో రాజధాని మోహ్రౌలీ అటవీ ప్రాంతంలో ముక్కలను పడేశాడు. శవం అయితే ఎవరి కంట అయినా పడుతుందని దీంతో తన వ్యవహారం అంతా బయట పడుతుందనుకున్న అప్తాబ్ ఆమె శవాన్ని ముక్కులుగా చేసి అటవీ ప్రాంతంలో చెల్లాచెదరుగా పడేశాడు. మాసం ముద్దలను జంతువులు తినడమో లేక అవి మట్టిలో కలిసిపోవడమో జరుగుతుందని భావించాడో ఏమో కానీ శ్రద్దను హత్య చేయడంలో అయినా ఆమె శవం దొరకకుండా అయినా అప్తాబ్ తీసుకున్న శ్రద్ద మాత్రం అంతా ఇంతకాదు. కానీ అసలు విషయం మాత్రం బయటకు పొక్కక తప్పలేదు.. పోలీసులు అప్తాబ్ నుండి వాస్తవాన్ని రాబట్టడంతో ఆయన వేసిన స్కెచ్ వెలుగులోకి రాక తప్పలేదు.
తండ్రి ఫిర్యాదుతో…
ముంబైకి చెందిన శ్రద్ద అప్తాబ్ తో కలిసి ఉంటున్నప్పటికీ తల్లిదండ్రులతో ఫోన్లో టచ్ లో ఉండేది. అయితే కొంతకాలంగా తన కూతరు ఫోన్ కలవకపోవడంతో అనుమానించిన ఆమె తండ్రి ఢిల్లీలోని ఫ్లాట్ కు వచ్చి చూడగా లాక్ చేసి ఉంది. దీంతో అనుమానించిన ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పూర్తి వివరాలు రాబట్టాలని భావించారు. ముందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాల కోసం వేట ప్రారంభించారు. మరో వైపున అప్తాబ్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం చేసి విషయాన్ని ఒప్పుకుని హత్యకు పాల్పడిన విధానం, శవాన్ని ముక్కలు చేసి ఫారెస్ట్ లో పడేసిన తీరు అన్ని వివరాలను పోలీసులకు చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేశారు.