గంగులూరు DVCM దినేష్ మోడియం సరెండర్: మరో 16 మంది నక్సల్స్ లొంగుబాటు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకునితో సహ మరో 16 మంది నక్సల్స్ బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఏసీఎం క్యాడర్ నాయకురాలు కూడా ఉన్నారు. గురువారం చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేందర్ కుమార్ యాదవ్, సీఆర్పీఎఫ్ అధికారుల ముందు మావోయిస్టు పార్టీ గంగూళురు డివిజన్ కమిటీ సభ్యుడు, పశ్చిమ బస్తర్ కమిటీ సభ్యుడు దినేష్ మోడియం, అతని భార్య ఏసీఎం జ్యోతితో పాటు మరో 15 మంది జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు ప్రకటించారు.

సంచలన ఆరోపణలు…

మావోయిస్టు పార్టీపై డీవీసీఎం దినేష్ మోడియం సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టు పార్టీ కాంట్రాక్టర్ల వద్ద వసూళ్లకు పాల్పుడుతోందన్నారు. 20 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసిన తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై లొంగిపోతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం వల్లే దండకారణ్యంలోని ఆదివాసీ ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ది చెంతుతాయని వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీ ఇచ్చిన జల్ జంగిల్ జమిన్ నినాదంతో అడవి బాట పట్టిన తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానన్నారు.

డీవీసీఎం దినేష్ మోడియం వ్యాఖ్యల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

https://youtu.be/UNhqxUszB80

లొంగుబాటపై ఎస్పీ బీజాపూర్ చేసిన ప్రకటన సారాంశం గురించి ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

https://youtube.com/shorts/H1L86MZaN40?feature=share

You cannot copy content of this page