తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఇటీవల ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించడంలో భాగంగా జిల్లాల్లో పర్యటనలకు శ్రీకారం చుట్టడంతో ముందస్తు ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. అంతేకాకుండా సెక్రటరియేట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుంది. ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించడంటో.. ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం మరింత జోరుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, ముందుగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేనే లేదని తెలిపారు, ఐదేళ్ల పాటు పూర్తికాలం అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రతిపక్షాలు కావాలని ప్రచారం చేస్తున్నాయని, తమ పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేసేందుకు ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ సందర్బంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుపై వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ధర్మపురి అర్వింద్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీల నేతలంరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని తెలిపారు. మార్చి తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని సూచించారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గాంధీభవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావును కలిసిన సమయంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని తెలిపారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించారని, కాంగ్రెస్ గెలుపు కోసం అందరం కలిసి పనిచేయాలని సూచించారు, అంతకుముందు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని ట్వీట్ చేయడం కలకలం రేపింది. ఇలా అన్ని పార్టీల నేతలందరూ ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది.

You cannot copy content of this page