దిశ దశ, అంతర్జాతీయం:
థైవాన్ దేశంలో భూకంపం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రాజధానిక తైపీతో పాటు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న భూకంపం వల్ల భారీ భవనాలు కుంగిపోయాయి. భవనాల్లో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7.2 నుండి 7.4 వరకు భూకంప తీవ్రత ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం. బీబిన్ స్ట్రీట్, హువాలియన్ సిటీ, హువాలియన్ కౌంటీ, హ్యువాలియన్ హ్యాపీ, తూర్పు థైవాన్ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది.
